భారతీయ మరియు చైనా సైన్యాలకు కీలక ప్రాంతంగా మారిన లడఖ్ లో చలి చుక్కలు చూపిస్తుంది. కీలకమైన తూర్పు లడఖ్ లో ఉష్ణోగ్రతలు వేగంగా తగ్గడంతో, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్‌ఎ) చాలా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. వాళ్లకు చల్లటి ప్రాంతంలో అనేక ఇబ్బందులు వస్తున్నాయని, వాళ్లకు ఆ ప్రాంతంలో అనుభవం లేదని పోలీసులు వెల్లడించారు.
సెంటినెల్ నుండి వచ్చిన తాజా ఉపగ్రహ చిత్రాలు పాంగోంగ్ త్సో సరస్సుని పాక్షికంగా మంచు కప్పేసింది అని, దీనితో మూసివేసారు అని అధికారులు వెల్లడించారు. మరో రెండు సరస్సులు పూర్తిగా గడ్డ కట్టుకుపోయే అవకాశం ఉంది అని ఆర్మీ అధికారులు వెల్లడించారు. కఠినమైన శీతాకాలం కోసం భారతదేశం పూర్తి స్థాయిలో సిద్దమైనా చైనా ఈ పరిస్థితిని అంచనా వేయలేకపోయింది. ఇది వాళ్లకు ప్రధాన సమస్యగా మారింది అని అధికారులు వెల్లడించారు.