నెయిల్‌ కట్టర్‌తో కోబ్రా కొరలు పీకేశాడు..నిఘానేత్రాలకు చిక్కడంతో…

-

పాములంటే ఎవరైన భయపడతారు..చిన్నాపెద్దా అంటూ తేడా ఉండదు.. అయితే స్నేక్‌ క్యాచర్స్‌ మాత్రం పాములకు అంతగా భయపడరు. ఏ కన్నంలో నక్కినా..ధైర్యంగా పట్టుకుంటారు. కొన్నిసార్లు అత్యుత్సాహం పోయి..వాటికి ముద్దులు కూడా పెడతారు. అలాంటి ఘటనలు కూడా ఈ మధ్య సోషల్‌ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం. పాము విషం ఎంత ప్రమాదకరమో అందరికీ తెలుసు. కానీ ఆ విషానికి బయట మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్‌ ఉంది. ఈ మధ్యనే కోట్లు విలువ చేసే విషాన్ని అధికారులు పట్టుకున్నారు. పాము విషం తీయాలంటే..దాని కొరలు తీయాలి.. కానీ ఇలా చేయడం చట్టవిరుద్ధం..అయినా మాత్రం ఎవరు వింటారు.. ఒక వ్యక్తి అయితే..ఏకంగా నెయిల్‌ కట్టర్‌తో పాము కొరలు తీశాడు.. ఇప్పుడు ఈ వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది.
నెయిల్ కట్టర్‌తో కింగ్ కోబ్రా కోరలను పీకేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. కోరలను పీకుతున్న దృశ్యాలు అక్కడ ఉన్న ఓ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దీనిని తీవ్రంగా తీసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచంలోనే అత్యంత పొడవైన విషపూరిత పాము నాగుపాము. ఒడిశాలోని బలంగీర్ జిల్లాలోని బిలిసర్దా గ్రామంలో ఓ వ్యక్తి ప్రమాదకర పామును పట్టుకున్నాడు. దాని కోరలు తీసేందుకు నెయిల్ కట్టర్‌ను ఉపయోగించాడు. అతని నుంచి తప్పించుకునేందుకు పాము తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా.. బాధతో మెలికలు తిరుగుతున్నా అతడు మాత్రం వదలలేదు. సమాచారం అందుకున్న అటవీ అధికారులు పామును రక్షించారు. పాము కోరలను తొలగిస్తున్నారనే అనుమానంతో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
వన్యప్రాణుల చట్టం ప్రకారం.. పామును రక్షించిన తర్వాత దానిని అడవిలోకి విడిచిపెట్టాలి. కోరలు తీసే విధానం చట్టవిరుద్ధం. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు..అతనిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మూగజీవాలను తీవ్రంగా హింసకు గురిచేస్తున్నాడని జంతు ప్రేమికులు మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news