కాంట్రాక్టు లెక్చరర్లకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. TRS పార్టీ కార్య వర్గ సమావేశానికి ముందు సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాసేపట్లో టీఆర్ఎస్ శాసనభాపక్ష , రాష్ట్ర కమిటీ సమావేశం జరుగనుంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్దీకరణకు ఉత్తర్వులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే, ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీ ల ఎంబీబీఎస్ క్లాసులు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా వర్చువల్ గా ప్రారంభం కానుంది. ఇక ఇవాళమధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ విస్తృత స్థాయి సమవేశం జరుగనుంది. టిఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ అధ్యక్షతన భేటీ జరుగనుంది. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు , ఎంపీ లతో పాటు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గం సభ్యులు పాల్గొననున్నారు.