ఎక్కువ లగేజ్ ఉంటే..మనం బైక్ ఉన్నా..ఆటో, బస్సులనే ఎంచుకుంటాం.. ఎందుకంటే..ఇబ్బంది లేకుండా వెళ్లొచ్చు అని.. 30 కేజీల వరకూ అదనపు టికెట్‌తో పనిలేకుండానే వెళ్లొచ్చు. అయితే ల్యాప్‌టాప్ ఉందని ఓ ప్రయాణికుడి దగ్గర నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేశాడు ఓ కండక్టర్. కేవలం ల్యాప్‌టాప్ ఉన్నందుకే అదనంగా డబ్బులు అడగటం ఇప్పుడు చర్చనియాంశం అయింది. ప్రభుత్వం కొత్త రూల్స్ తెచ్చింది. కచ్చితంగా ఇవ్వాలి అని డిమాండ్ చేశాడు. నిజంగా అలాంటి రూల్ ఉందా..?
గడగ్ నుంచి హుబ్లీకి ఆర్టీసీ బస్సులో ప్రయాణించేందుకు ఓ ప్యాసింజర్ టికెట్ తీసుకున్నాడు. అయితే అతని దగ్గర ల్యాప్‌టాప్ కూడా ఉండటంతో బస్ కండక్టర్ కొత్త రూల్ పెట్టి 10రూపాయలు అదనంగా ఇవ్వాలని కోరాడు. ప్రయాణికుడు ఎందుకని అడిగితే లాగేజీ తీసుకెళ్తున్నావంటూ వింత కారణం చెప్పడంతో బాధితుడు అవక్కయ్యాడు. ఆర్టీసీ బస్సులో ల్యాప్‌టాప్ తీసుకెళ్తే అదనపు ఛార్జీ ఎందుకివ్వాలి..30కేజీల బరువు వరకు లగేజీ ఛార్జీలు లేవని ప్రయాణికుడు వివరంగా చెప్పినప్పటికి కండక్టర్ వినలేదు. కొత్త రూల్స్ వచ్చాయి..మీకు తెలియాదా అంటూ దబాయించి అదనపు ఛార్జీ వసూలు చేసే వరకు ప్రయాణికుడ్ని వదిలిపెట్టలేదు. దీంతో 10రూపాయలు అదనంగా చెల్లించాల్సి వచ్చింది.
కర్నాటక రోడ్డు రవాణా సంస్థ అక్టోబర్ 29న జారీ చేసిన కొత్త రూల్స్ ప్రకారం 30కేజీల లగేజీ వరకు టికెట్ లేకుండా తీసుకెళ్ల వచ్చని సూచింది. అలాగే 30కేజీలు దాటితే అదనపు టికెట్ వసూలు చేయాలంది. అలాగే బస్సుల్లో పెంపుడు జంతువులు, కుక్కలను తీసుకెళ్లే ప్రయాణికుల దగ్గర గతంలో ఫుల్ టికెట్ వసూలు చేస్తూ వచ్చారు. మారిన నిబంధనల ప్రకారం.. వీటిని కూడా హాఫ్ టికెట్ క్యాటగిరీలో చేర్చారు. కొత్త రూల్స్ మార్చిన తర్వాత కూడా కండక్టర్ వాటిని అమలు చేయకుండా కేవలం కిలో బరువుండే ల్యాప్‌టాప్‌కి 10రూపాయల అదనపు ఛార్జీ వసూలు చేయడం గమనార్హం..కర్నాటక రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ సంస్థపై ప్రయాణికులు మండిపడుతున్నారు. నెటిజన్లు కూడా విషయం తెలిసి అవక్కాయ్యారు.