తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న ఏపీకి చెందిన ప్రేమ జంట..

దేశంలో రోజు రోజు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఇంట్లో పెద్దలు పెళ్లి కి నిరాకరించారనే చిన్న చిన్న కారణాలతో ప్రేమ జంటలు ఆత్మహత్యలు చేసుకుంటున్నాయిజ అయితే.. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లా లో రైలు కింద పడి ఓ ప్రేమ జంట ఆత్మ హత్య చేసుకుంది.

గద్వాల రైల్వే స్టేషన్ కి సమీపంలో మేళ్ల చెరువు రోడ్డు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఇవాళ తెల్లవారు జామున బెంగళూర్ ఎక్స్ ప్రెస్‌ రైలు కింద పడి ఈ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందుతోంది.

అయితే… ఈ ఘటన ట్విస్ట్‌ ఏంటంటే…. ఈ మృతి చెందిన వారు ఆంధ్ర ప్రదేశ్‌ కు చెందిన వారు కావడం. అనంతపురం జిల్లా ధర్మవరం గ్రామానికి గంగ రాజు (22 ) లక్ష్మి (20) లుగా గుర్తించారు పోలీసులు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు రైల్వే పోలీసులు. అసలు ఈ ప్రేమ జంట ఆత్మహత్య కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు. కుటుంబ సభ్యుల విచారించేందుకు సిద్దమయ్యారు పోలీసులు.