టాలీవుడ్ హీరో మాస్ మాహారాజా రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తోన్న సినిమా ధమాకా. ఈ మూవీ ఆడియో ఫంక్షన్లో తమను అవమానించారంటూ ఉప్పర కులస్తులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే.. ఈ విషయంపై దర్శకుడు త్రినాథరావు క్షమాపణ చెప్పారు..
ధమాకా సినిమా ఆడియో ఫంక్షన్ లో తమ కులస్తుల్ని అవమానపరిచారు కులస్తులు ఆందోళన చేపట్టారు అంతేకాకుండా ఈ విషయంపై ఆయన వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించి ఫిలిం చాంబర్ వద్ద బైఠాయించారు.. అలాగే చిత్ర దర్శక నిర్మాతలు తమకు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు.. అక్కడితో ఆగకుండా ఉప్పర పదాన్ని బహిష్కరించాలని సూచించారు. ఇకపై రాజకీయనాయకులు, సినీ నటులు, ఇతరులు ఎవరూ ఉప్పర పదం వాడొద్దన్నారు.
ఈ విషయంపై దిగివచ్చిన దర్శకుడు త్రినాధరావు వారందరికీ క్షమాపణలు తెలిపారు.. అలాగే తనపై ఉన్న కోపాన్ని సినిమాపై చూపించొద్దని వేడుకున్నారు. తానూ బీసీనేనని ఉప్పరులు కూడా బీసీల్లో భాగమేనన్నారు. అలాగే తమరంతా మా సినిమాను ఆదరించి తప్పకుండా విజయం సాధించేలాగా చేయాలంటూ చెప్పుకొచ్చారు..
ధమాకా సినిమా డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పోస్టర్స్, సాంగ్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ధమాకా ఆడియో ఫంక్షన్ నిర్వహించింది చిత్రయూనిట్. అయితే ఈ ఈవెంట్ లే డైరెక్టర్ త్రినాథరావు మాట్లాడుతూ.. “ఏంటీ నీ ఉప్పర సోది “అంటూ కామెంట్ చేశారు. ఈ విషయంపై స్పందించిన ఉప్పర కులస్తులంతా తమ కులాన్ని అపహాలను చేశారంటూ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే..