రాజకీయ పార్టీలు పది రోజుల నుంచి ఆవేశ పడుతూ చేసిన ప్రచారం, ఎన్నికల సంఘం పెట్టిన ప్రచార హోర్డింగ్ లు, సోషల్ మీడియాలో సినిమా స్టార్ లు చేసిన వ్యాఖ్యలు అన్నీ కూడా వృధా అయ్యాయి. సోషల్ మీడియాలో ఎంతో హడావుడి చేసే హైదరాబాద్ యువత ఓటు వేయడానికి మాత్రం ముందుకు రాలేదు. అసలు ఉదయం నుంచి ఇప్పటి వరకు 30 శాతం కూడా పోలింగ్ నమోదు కాలేదు.
ఐటి ఉద్యోగులు ఉన్న ప్రాంతాల్లో అయితే కనీసం 20 శాతం కూడా పోలింగ్ నమోదు కాలేదు. దీనితో కొన్ని చోట్ల ఎలక్షన్ సిబ్బంది కబుర్లు పెట్టుకోవడం, మరికొన్ని చోట్ల అయితే నిద్రపోవడం జరిగింది. పోలింగ్ కి ఇంకా గంట మాత్రమే ఉండటంతో వచ్చి ఓటు వేయాలని కోరుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అయింది. ఎలెక్షన్ సిబ్బంది ఎవరూ లేకపోవడంతో కునుకు తీసారు.