ఏపీ ఉద్యోగులకు మరో షాక్‌..జీతాలు, పెన్షన్లపై సర్కార్‌ కీలక ఆదేశాలు

-

ఏపీ ఉద్యోగులకు మరో షాక్‌ ఇచ్చింది జగన్‌ సర్కార్‌. జీతాల, పెన్షన్ల బిల్లుల ప్రక్రియపై మరోసారి ఆర్థిక శాఖ సర్కులర్ జారీ చేసింది. కొత్త పే స్కేళ్ల ప్రకారమే జీతాలు, పెన్షన్ల బిల్లులను ప్రాసెస్ చేయాలని సూచనలు చేసింది ప్రభుత్వం. సర్కులర్ ప్రకారం నిర్దేశిత గడువులోగా జీతాలు, పెన్షన్ల బిల్లుల ప్రక్రియను చేపట్టకుంటే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించింది. డీడీఓలు, పీఏఓలు, ట్రెజరీ అధికారులకు చర్యలు తప్పవని స్పష్టం చేసింది.

జీతాలు, పెన్షన్ల బిల్లులను ప్రాసెస్ చేసే అంశంపై టైమ్ లైన్ నిర్దేశిస్తూ సర్కులర్ జారీ చేసింది ప్రభుత్వం. ఇవాళ సాయంత్రంలోగా బిల్లులను అప్ లోడ్ చేయాలని డీడీఓలకు సూచనలు జారీ చేసింది సర్కార్‌. రేపటిలోగా అప్ లోడ్ చేసిన బిల్లులను ప్రాసెస్ చేయాల్సిందిగా పే అండ్ అకౌంట్స్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 1వ తేదీ నాటికి జీతాలు జమయ్యేలా చూడాలని ట్రెజరీ అధికారులకు ఆర్థిక శాఖ సర్కులర్ ఇచ్చింది. ఈ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని కార్యదర్శులకు, హెచ్వోడీలకు, కలెక్టర్లకు ఆర్ధిక శాఖ ఆదేశాలు జారీ చేసింది.

 

Read more RELATED
Recommended to you

Latest news