సీఎం కేసీఆర్ కు షర్మిల బహిరంగ లేఖ.. సిగ్గుతో తలదించుకో అంటూ !

రైతు బతికి ఉన్నంత వరకు రైతు బీమా ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు వైఎస్సార్ టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. రైతు భీమా విషయంలో కేసీఆర్ ప్రభుత్వం పై కేసులు పెట్టి న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. యూపీలో కేసీఆర్ ప్రచారం జోక్ అని.. తెలంగాణ రాష్టానికే ముఖ్యమంత్రి అవడం మన కర్మ అంటూ చురకలు అంటించారు. అలాంటిది దేశాన్ని ఆయన చేతుల్లో పెడితే ఏమైనా ఉంటుందా? అని ఎద్దేవా చేశారు.

కేసీఆర్ లాంటి వ్యక్తి పందిరి వేస్తే కుక్క తోక తగిలి కూలిపోయిందంట అలా ఉంటుందంటూ కేసీఆర్‌ పై సెటైర్లు పేల్చారు. తాజాగా తెలంగాణలో ఐదుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలా బాధాకరమన్నారు. ధరణి పోర్టల్ వల్ల ఒకరు, ఇద్దరు పత్తి రైతులు, మరో ఇద్దరు యువ రైతులు ఆత్మహత్యలు చేస్తున్నారని.. రైతులు చనిపోతుంటే కేసీఆర్ కు చీమ కుట్టినట్లు అయిన లేదని మండిపడ్డారు.

39 లక్షల మందికి రుణమాఫీ చేస్తానని చెప్పి… మూడు లక్షల మందికి మాఫీ చేశారని.. 36 లక్షల మంది రైతులను కేసీఆర్ మోసం చేశారని ఆగ్రహించారు.పంటలు నష్టపోతే ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తున్నారా? పంట బీమా లేదు. ఎటూ చూసినా నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువులే అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.