ఎన్నికలక ఖర్చులో త్రుణమూల్ కాంగ్రెస్ టాప్.. తర్వాత డీఎంకే..

-

ప్రస్తుత భారత రాజకీయంలో డబ్బు కీలకంగా మారింది. ఎన్నికల సమయాల్లో రాజకీయ పార్టీ ఖర్చు వందల కోట్లు దాటుతోంది. అయినా ఖర్చుకు వెనకాడకుండా గెలుపే లక్ష్యంగా పార్టీలు కోట్లు ఖర్చుపెడుతున్నాయి. గత ఫిబ్రవరి నెలలో బెంగాల్, కేరళ, పుదుచ్చేరి, అస్సాం, తమిళనాడు ఎన్నికలు జరిగాయి. అయితే ప్రస్తుతం ఆ ఎన్నికల్లో ఏ పార్టీ ఎంతెంత ఖర్చు పెట్టిందనే వివరాలను ఎన్నికల కమీషన్ తెలిపింది. ఎన్నికల సమయంలో ప్రతీ రాజకీయ పార్టీ తాను పెట్టిన ఖర్చును ఈసీకి ఇవ్వాల్సి ఉంటుంది. తాజా రిపోర్ట్ ప్రకారం గత ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో త్రుణమూల్ కాంగ్రెస్ అత్యధికంగా ఖర్చు పెట్టింది ఆ తర్వాత స్థానంలో డీఎంకే ఉంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలో త్రుణమూల్ ఏకంగా రూ. 158.24 కోట్లు ఖర్చు చేయగా, తమిళనాడు, పుదుచ్చేరికి కలిపి డీఎంకే రూ. 114.4 కోట్లు ఖర్చు చేసింది. కాంగ్రెస్ ఐదు రాష్ట్రాలకు కలిపి రూ.84.93 కోట్లు, సీపీఐ రూ. 13.19, అస్సాం గణపరిషత్ రూ. 15.16 లక్షలు ఖర్చు చేసినట్లుగా ఈసీ రిపోర్ట్ తెలుపుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news