దేశంలోనే తొలి ప్రైవేట్ రైలు సర్వీస్.. ఇక్కడి నుంచే ప్రారంభం!

-

దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రైవేట్ రైలు సర్వీస్ ప్రారంభమైంది. ‘భారత్ గౌరవ్’ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ రైలును ప్రారంభించింది. ఈ ప్రైవేట్ రైలు తమిళనాడులోని కోయంబత్తూర్ నార్త్ నుంచి మహారాష్ట్రలోని షిర్డీ సాయినగర్ వరకు నడుస్తుంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకే ఈ ట్రైన్‌ను కేంద్రం ప్రారంభించింది. దీంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రైవేట్ రైలు సర్వీస్‌ను ప్రారంభించిన ఘనత దక్షిణ రైల్వేకు దక్కింది.

ప్రైవేట్ రైలు
ప్రైవేట్ రైలు

20 భోగీలు కలిగిన ఈ ట్రైన్‌ను సేలం డివిజన్ మేనేజర్ గౌతమ్ శ్రీనివాస్ ప్రారంభించారు. తొలిరోజే ఈ ట్రైన్‌లో 11 వేల మంది ప్రయాణించినట్లు గౌతమ్ శ్రీనివాస్ తెలిపారు. ఈ రైలు.. ఈరోడ్, సేలం, యెలహంక, ధర్మవరం, మంత్రాలయం మీదుగా ప్రయాణిస్తుందని పేర్కొన్నారు. షిర్డీ చేరుకున్న ప్రయాణికులకు బస్సు సౌకర్యంతోపాటు, ఆలయ దర్శన ఏర్పాట్లు కూడా కల్పిస్తామన్నారు. తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ మంత్రాలయం వద్దు 5 గంటలు ఆగుతుందన్నారు. ఆ సమయంలో భక్తులు మంత్రాలయం దర్శించుకుని మళ్లీ రిటర్న్ అవ్వొచ్చన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news