తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద పార్కింగ్ వసతులు మరియు అప్రోచ్ రోడ్డు కొరకు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ సంస్థకు భూమిని కేటాయించి అభివృద్ధి చేయించాలని,నాగులపల్లి రైల్వేస్టేషన్ వద్ద టెర్మినల్, పార్కింగ్ అభివృద్ధి కోసం 300 ఎకరాలు, అప్రోచ్ రోడ్డు కోసం కూడా అవసరమైన స్థలాన్ని కేటాయించాలని ఈ లేఖలో అభ్యర్థించారు సీఎం కేసీఆర్.
సికింద్రాబాద్, నాంపల్లి మరియు కాచిగూడ రైల్వేస్టేషన్లలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి వీలుగా, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు తూర్పున ఉన్న చర్లపల్లి రైల్వేస్టేషన్‌లో మార్చి 2023 నాటికి కొత్త టెర్మినల్ ను అందుబాటులోకి తీసుకురావటానికి అవసరమైన అభివృద్ధి పనులను దక్షిణ మధ్య రైల్వే చేపట్టడం జరిగిందన్నారు.
ఎఫ్‌సిఐ గోడౌన్ వైపు నుండి స్టేషన్ కొత్త భవనం వైపుకు వెళ్ళే 100 అడుగుల వెడల్పుగల రోడ్డును రాష్ట్ర ప్రభుత్వము అభివృద్ధి చేయుటకొరకు ప్రతిపాదించారని.. భరత్ నగర్ వైపు గల అప్రోచ్ రోడ్డు 28 అడుగులు మాత్రమే కలదు. ఈ రోడ్డును కనీసం 60 అడగుల వెడల్పు గల రోడ్డుగా చేయుటకు తగిన స్థలమును సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ సంస్థకు కేటాయించాల్సి ఉందని పేర్కొన్నారు. పైన ప్రతిపాదించిన అప్రోచ్ రోడ్లను సత్వరమే అభివృద్ధి చేయాలని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ సంస్థకు ఆదేశాలు జారీ చేయాలని మనవి చేస్తున్నానని డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి.