శుభవార్త: తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. భవిష్యత్‌లో మరింతగా..!

-

దేశీయ చమురు కంపెనీలు వాహనదారులకు శుభవార్త అందించనుంది. గత 15 రోజులుగా స్థిరంగా ఉన్న ఇంధన ధరల్లో (పెట్రోల్, డిజీల్) స్వల్ప మార్పులు ఏర్పడ్డాయి. చమురు కంపెనీలు ఈ రోజు విడుదల చేసిన పెట్రోల్, డీజిల్ ధరలపై లీటర్‌కు 16 పైసలు తగ్గించాయి. కాగా, గతంలో మార్చి 30వ తేదీన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించగా.. ప్రస్తుతం తగ్గించింది. దీంతో వరుసగా అప్పుడు మూడు రోజుల్లో లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 61 పైసలు తగ్గించింది. కానీ, ప్రస్తుతం మరో 16 పైసలు తగ్గించడంతో వాహనదారులకు మరింత ఉపశమనం లభించింది.

పెట్రోల్-డీజిల్
పెట్రోల్-డీజిల్

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 65 డాలర్ల కంటే తక్కువగా ఉంది. కరోనా వ్యాప్తి, అమెరికాలో పెరుగుతున్న స్టాక్స్ కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు భవిష్యత్‌లో మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధరపై 16 పైసలు తగ్గించిన తర్వాత భారత దేశంలోని పలు నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర గతంలో రూ.90.56 ఉండగా.. ప్రస్తుతం రూ.90.40 ఉంది. అలాగే డీజిల్ ధర రూ.80.73కి తగ్గింది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 96.83, డీజిల్ ధర రూ.87.81, కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.90.62, డీజిల్ ధర రూ.83.61కి తగ్గింది. చైన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.92.43, డీజిల్ ధర రూ.85.75కి పడిపోయింది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.93.99, డీజిల్ ధర రూ.88.05కి తగ్గింది.

అయితే దేశీయ చమురు కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్‌లో గత 15 రోజుల ముడి చమురు సగటు ధర ఆధారంగా పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి. ఈ చమురు కంపెనీలు కూడా డాలర్‌తో రూపాయిని పోల్చుతాయి. దీని వల్లే ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. కాగా, మీమీ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలను ఇప్పుడు ఎస్ఎంఎస్ రూపంలో కూడా పొందవచ్చు. మీ మొబైల్‌లో ఆర్ఎస్‌పీ, మీ సిటీ కోడ్‌ను రాసి 9224992249 నంబర్‌కు ఎస్ఎంఎస్ పంపించాలి. అప్పుడు మీ నగరంలో ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలను సులభంగా తెలుసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news