మీ భాగస్వామితో బంధం బాగుండాలంటే ఈ అలవాట్లు మానుకోండి..

-

ఏ బంధమైనా నిలబడాలంటే వారిద్దరి మధ్యలో స్నేహం ఉండాలని చెబుతుంటారు. ఏ రిలేషన్ షిప్ లో సమస్య వచ్చినా తొందరగా క్లియర్ కాదు. అదే స్నేహంలో ఏదైనా ప్రాబ్లమ్ వస్తే, తొందరగా క్లియర్ అయిపోతుంది. ఎంతైనా మనవాడే కదా, నా ఫ్రెండే కదా, ఏమవుతుంది వంటి కారణాల వల్ల స్నేహంలో ఎదుటి వారి లోపాలనిపెద్దగా పట్టించుకోరు. ఐతే స్నేహం కూడా దూరమయ్యే కొన్ని సంఘటనలు ఉంటాయి. అలాంటి వాటికి వెళ్ళకుండా స్నేహ బంధాన్ని కొనసాగిస్తే జీవితమంతా ప్రశాంతంగా ఉంటుంది.

ఒక బంధం విడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

వ్యాపార విషయాల వల్ల మీ మూడ్ బాగాలేనప్పుడు ఆ కోపాన్ని మీ భాగస్వామిపై చూపవద్దు. ఆఫీసు ఒత్తిడి, వర్క్ లోడ్, మొదలగు విషయాల వల్ల మీ మూడ్ మారిపోతుంది. ఐతే అవన్నీ ఆఫీసుకి మాత్రమే పరిమితం కావాలి. వాటిని మీతో పాటు ఇంటిదాకా తీసుకువచ్చి, ఆ మూడ్ లో మీ భాగస్వ్వామిపై చిరాకు పడే అవకాశం ఉంటుంది.

మీరేదైతే ఫీల్ అవుతున్నారో ఆ విషయాలని మీ భాగస్వామితో పంచుకోండి. మీరేదో దాస్తున్నారన్న అనుమానం వాళ్లకి రావద్దు.

భాగస్వామి ఏదైనా అడిగితే అది తీసుకువచ్చేందుకు ప్రయత్నించండి. అలా వీలు కాని పక్షంలో దానికి తగిన సమాధానం ఇవ్వండి. కానీ పట్టించుకోనట్టుగా అస్సలు ఉండవద్దు.

ఒక్కోసారి తప్పు మీదైనా తగ్గాల్సి ఉంటుంది. పంతాలకు పోయి తెగే దాకా తెచ్చుకోవద్దు.

ఎప్పుడూ మీదే పైచేయి ఉండాలని, మీరు చెప్పిందే వారు వినాలని, మీ అదుపాజ్ఞల్లో ఉండాలని అస్సలు అనుకోవద్దు. ఎవ్వరైనా స్వేఛ్ఛ కోరుకుంటారు. అది మీరు గుర్తించాలి.

మీ భాగస్వామిని ఇతరులతో అస్సలు పోల్చవద్దు. వారిలో లేని లక్షణాలు మీ భాగస్వామిలో ఉండవచ్చు. అది మీరు గుర్తించలేకపోవచు.

మీ అంచనాలకి తగినట్టుగా మీ భాగస్వామి లేరని అప్సెట్ అవకండి. మీ అంచనాలను నిజం చేసేందుకు మీకు భాగస్వామిగా రాలేరని గుర్తించండి.

ఏదైనా విషయంలో తప్పు నీదంటే నీదని వాదించడం ఆపేయండి. సమస్య ఉంటే చర్చించండి తప్ప, తప్పు మీదేనని వాదించవద్దు.

Read more RELATED
Recommended to you

Latest news