మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై మొదలైన విచారణ

-

ఢిల్లీ మద్యం కుంభకోణం దేశవ్యాప్తంగా ఇంతటి సంచలనం సృష్టిస్తుందా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కేసులో జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా బెయిల్ పిటీషన్ పై ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు స్పెషల్ కోర్టులో విచారణ ప్రారంభమైంది. ఇదే సమయంలో మనీశ్ సీశోడియాను మరో పది రోజులు రిమాండును కోరుతూ చేసిన ఈడి దాఖలు చేసిన దరఖాస్తుపై కూడా విచారణ చేపట్టనుంది ధర్మసనం.

ఇక ఇదే కేసులో రేపు ఈడి విచారణకు హాజరు కానున్నారు బిఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఇప్పటికే ఈడి కస్టడీలో ఉన్నారు రామచంద్ర పిళ్ళై. 13వ తేదీ (సోమవారం) ముగియనుంది రామచంద్ర పెళ్లయి కస్టడీ. ఈరోజు మనిషి సిసోడియా రిమాండ్ మంజూరైతే, పది రోజులు పాటు ఈడి కస్టడీలో ఉండనున్నారు సిసోడియా. దీంతో రేపు సిసోడియను రామచంద్ర పిళ్లై, కవితను ఏకకాలంలో ఎదురెదురుగా కూర్చోబెట్టి ఈడి ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news