ఏపీ హైకోర్టులో పిన్నెల్లి పిటిషన్ పై విచారణ ప్రారంభం..!

-

ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పలు చోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరులు బీభత్సమే సృష్టించారు. పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎం మిషన్ ను ధ్వంసం చేశారు. పోలింగ్ సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

దీంతో సీఈవో ముఖేష్ కుమార్ మీనా పిన్నెల్లిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని.. ఆయన కోసం పోలీసులు గాలింపులు చేపడుతున్నారని తెలిపారు. ఈ తరుణంలోనే ఇవాళ మధ్యాహ్నం నుంచి నరసరావుపేటలో పిన్నెల్లి లొంగిపోతున్నారంటూ వార్తలు వినిపించాయి. మరోవైపు నరసరావుపేట కోర్టు ప్రాంగణం వద్ద పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మరికొద్ది సేపటికే ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపారు.  నారా లోకేష్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ కు వెళ్లడం సరికాదని లాయర్ కోర్టుకు తెలిపారు. అది మార్ప్ వీడియో కూడా అయ్యే అవకాశముంది. గతంలో సుప్రీంకోర్టు తీర్పును కూడా కోట్ చేసిన పిటిషన్ తరపు లాయర్. ఈ విచారణకు బ్రేకు పడింది. తిరిగి మరికొద్ది సేపట్లో విచారణ చేపట్టనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news