సాగర్ ఉపఎన్నిక ఏకగ్రీవం పై టీఆర్ఎస్ కొత్త ప్యూహం !

-

టిఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య అకాల మరణంతో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయిన సందర్భాలలో వారి కుటుంబ సభ్యులకే మళ్ళీ ఛాన్స్ ఇచ్చి ఎన్నిక లేకుండా ఏకగ్రీవం చేసిన సందర్భంలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆ సాంప్రదాయనికి చెక్ పెట్టింది టీఆర్ఎస్. ఇప్పుడు మళ్లీ పాత ప్రతిపాదన తెరపైకి తెచ్చి ఎన్నిక ఏకగ్రీవం పై కొత్త ప్యూహం రచిస్తుందట గులాబీ దళం…

నాగార్జున సాగర్ ఉప ఎన్నికను ఏకగ్రీవం చేయాలన్న మండలి చైర్మన్ గుత్తా ప్రతిపాదన ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సంప్రదాయంను ఇప్పడు గుత్తా ఎందుకు గుర్తు చేశారు ఏకగ్రీవ ప్రతిపాదనకు రాజకీయ పార్టీలు ఒకే చెబుతాయా అన్నది ఆసక్తికరంగా మారింది. గత టర్మ్ లో నారాయణఖేడ్ ఎమ్మెల్యే చనిపోవడంతో ఉప ఎన్నిక అనివార్యం అయింది. అధికార టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపపడంతో బై ఎలక్షన్ వచ్చింది. అప్పటి బై ఎలక్షన్ లో టిఆర్ఎస్ అభ్యర్థి గెలిచారు.ఆ తర్వాత పాలేరు ఉప ఎన్నికలో టిఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా గెలిచారు.ఇదంతా టిఆర్ఎస్ అధికారంలో ఉన్న మొదటి టర్మ్ లో జరిగింది .

ప్రస్తుతం నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై రాజకీయంగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇటు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కామెంట్స్ ఇప్పడు చర్చనీయాంశంగా మారాయి. నల్గొండ జిల్లాలో గతంలో ఎమ్మెల్యే రాగ్య నాయక్ ను నక్సల్స్ చంపితే…ఆయన భార్య భారతిని ఏకగ్రీవంగా ఎన్నికున్న విషయాన్ని గుర్తు చేశారు గుత్తా. నాగార్జున సాగర్ లో కూడా అలా చేస్తే మంచి సంప్రదాయం అవుతుందని అన్నారు ఈ టీఆర్ఎస్ సీనియర్ నేత. ఒక వేళ ఈ ప్రతిపాదనను కాదని కాంగ్రెస్ ,బీజేపీలు అభ్యర్థిని బరిలో పెడితే టిఆర్ఎస్ తన వ్యూహంను అమలు చేస్తుందన్నారు గుత్తా.

నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు అన్ని పార్టీలు ఇప్పటికే గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టాయి. పార్టీలలో ఆశావహులు ఎవరి ప్రయత్నాలలో వాళ్ళు ఉన్నారు.ఇప్పడు ఒక్క సారిగా గుత్తా ఈ ఆలోచనను బయటపెట్టడం వెనుక కారణం ఏంటన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది .ఇప్పటి వరకు అయితే రాజకీయ పార్టీలు ఈ అంశంపై మాట్లాడలేదు.

మొత్తంగా తెలంగాణలో రాజకీయంగా టిఆర్ఎస్ పై పైచేయి సాధించాలని భావిస్తున్న కాంగ్రెస్, బిజెపిలు
ఈ ఆలోచన పై అంత సానుకూలంగా స్పందించే అవకాశాలు లేవన్న విశ్లేషణ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది .

Read more RELATED
Recommended to you

Latest news