నవీన్ పోలిశెట్టి హీరోగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా డైరెక్టర్ అనుదీప్ కేవి దర్శకత్వంలో తెరకెక్కిన జాతి రత్నాలు సినిమా ఎంత మంచి గుర్తింపు సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ జానర్ పై విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ మూవీతో తనదైన కామెడీ టైమింగ్ తోనే కాకుండా హైట్ పరంగా కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది ఈ హీరోయిన్. ఇప్పుడు ఈ అమ్మడు వరుస చిత్రాలతో బిజీగా ఉంది. ఇటీవల బంగార్రాజు చిత్రంతో వెండితెరపై స్పెషల్ సాంగులో మెరిసిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తో మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 4వ తేదీన విడుదల కానుంది.
ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరైన ఫరియా తన కెరియర్ వ్యక్తిగత విషయాలను పంచుకోవడంతోపాటు జాతి రత్నాలు షూటింగ్ సమయంలో డైరెక్టర్ అనుదీప్ చేత దెబ్బలు తిన్న విషయాన్ని కూడా వెల్లడించింది. షో లో భాగంగా ఆలీ అడిగిన ప్రశ్నలకు సరదాగా ఆన్సర్ చెబుతూనే జాతి రత్నాలు షూటింగ్ సమయంలో నిన్ను డైరెక్టర్ అనుదీప్ కొట్టారట కదా అని అడగ్గా.. క్లారిటీ ఇచ్చింది. అది సరదాగా జరిగింది ..ఆయన జోక్ చేసినప్పుడు నవ్వుతూ పక్కన ఉన్న వాళ్ళని కొడతారు. అది ఆయనకున్న అలవాటు ..అలా ఒకసారి నన్ను చేత్తో అలా అన్నారు.. అంతే అంటూ చెప్పుకొచ్చింది ఫరియా.
రాజమౌళి దర్శకత్వంలో నటించాలని ఉందని మనసులో మాట బయట పెట్టింది. హైదరాబాదులో పుట్టి పెరిగినా.. ఆమె కుటుంబం మాత్రం దుబాయ్ లో ఉంటున్నారు. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు ఓటీటీ లో కూడా సందడి చేయడానికి సిద్ధంగా ఉంది ఈ ముద్దుగుమ్మ.