అమరావతి : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహ ఏర్పాటు పై ఊహించని షాక్ తగిలింది. ఒంగోలులో రోడ్డు మధ్యలో డివైడర్ ఏర్పాటు చేసి మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేయడం పై ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు లో పిటిషన్ దాఖలైంది. విగ్రహం ఏర్పాటు కు వ్యతిరేకంగా డాక్టర్ రాజ్ విమల్ పిటిషన్ దాఖలు చేశారు.
సుప్రీంకోర్టు నిబంధనలు, జడ్జిమెంట్, జీవోలకు వ్యతిరేకంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేస్తున్నారంటూ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టుకు తెలిపారు పిటిషనర్ తరుపు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్. సుప్రీంకోర్టు జీవో, నిబంధనలు, జడ్జిమెంట్ లు స్పష్టంగా ఉన్నా రోడ్డు మధ్యలో డివైడర్ ఏర్పాటు చేసి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఎలా ఏర్పాటు చేస్తారని ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు సీరియస్ అయింది. అంతేకాదు.. విగ్రహం ఏర్పాటు చేయొద్దంటూ స్టే ఇచ్చింది హైకోర్టు. పిటిషనర్ తరుపు వాదనలు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వినిపించారు. ఇక ఈ కేసు
తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది ఏపీ హై కోర్టు.