అందరి జీవితం అందంగా వెళ్ళిపోదు. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో రకంగా బాధలు ఉంటాయి అయితే ఇటువంటి బాధలు అన్నిటిని కూడా దాటుకుంటూ వెళ్లాలి. ఏదైనా బాధ వచ్చినా.. కష్టం వచ్చినా అందులోనే కృంగిపోయి ఉండిపోకూడదు. అయితే చాలా మంది జీవితంలో జరిగేది ఏమిటంటే ఏదైనా ఒక సమస్య కానీ బాధని కానీ గతంలో ఎదుర్కొంటే అందులో నుండి అస్సలు బయటకు రాలేరు.
పదేపదే దానిని తలుచుకుని కుమిలిపోతూ ఉంటారు. దీని వలన ఏమవుతుందంటే పాత జ్ఞాపకాలు గుర్తుకు రావడం లేదంటే వారిలో వారు అనవసరంగా ఆ తప్పు చేశానని బాధపడటం తో పాటుగా వర్తమాన కాలం కూడా ప్రశాంతంగా ఉండదు. ఇప్పుడు చేసే పని పైన కూడా ధ్యాస పెట్టలేరు. కష్టపడడం లేదంటే విజయం పై ఏకాగ్రత పెట్టడం లాంటివి చేయరు.
దీనివల్ల గతంలోనే ఇప్పుడు కూడా బాధలే ఉంటాయి తప్ప ఏ మార్పు రాదు. అందుకని ఎప్పుడైనా సరే గతాన్ని అలా పక్కన పెట్టేసి భవిష్యత్తులో ముందుకు వెళ్ళి పోతూ ఉండాలి. దీని వలన మీకు ప్రశాంతత ఉంటుంది. పైగా విజయం అందుకోగలరు. అంతే కానీ మీరు ఆ గతంలోనే కూరుకుపోతూ ఉంటే సమయం వృధా తప్ప ఫలితం ఏమీ ఉండదు.
నిజానికి గతంలో తగిలిన గాయం వలన భవిష్యత్తు మారిపోతుంది. చేసిన తప్పు మళ్లీ రిపీట్ చేయకుండా మీరు నేర్చుకోగలుగుతారు. పైగా అప్పుడు మీరు ఎందులో దృష్టిపెట్టలేదు వంటివి తెలుస్తాయి. ఇలా మిమ్మల్ని మీరు మార్చుకుని మంచిగా ఉండొచ్చు.