శృంగారం అనేది ఇద్దరి మధ్య జరిగే ఒక చర్య అని కొందరు అంటారు..భార్య ఇష్టాఇష్టాలు ఏంటి అనేది పట్టించుకోరు.వాళ్ల మనసులోని కోరికలేమిటో తెలుసుకోవడానికి, పంచుకోవడానికీ సిగ్గుపడుతుంటారు. కొంతమందిలో ఉండే కొన్ని భయాలు కూడా శృంగార జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించకుండా అడ్డు పడుతున్నాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఈ తరహా భయాలు మగవారిలో కంటే మహిళల్లోనే ఎక్కువని కొన్ని అధ్యయనాలు రుజువు చేశాయి. నిజానికి ఇవి దంపతుల మధ్య అగాథం సృష్టించడమే కాదు.. శారీరక, మానసిక ఆరోగ్యాన్నీ దెబ్బతీస్తున్నాయంటున్నారు.
అందుకే అనవసర భయాల్ని దూరం చేసుకొని.. ఈ విషయంలో ఆలుమగలిద్దరూ తమ మనసు విప్పి మాట్లాడుకోవాలని, అప్పుడే శృంగార జీవితాన్ని సంతృప్తికరంగా మలచుకోవచ్చంటున్నారు. మరి ఆ భయాలు ఏంటో తెలుసుకుందాం రండి.
పెళ్లైనా మాకు అప్పుడే పిల్లలొద్దు.. అనుకునే దంపతులు కొందరుంటారు. ఇలాంటి వారు శృంగారంలో పాల్గొనడానికి వెనకాముందూ అవుతుంటారు. ఎందుకంటే దీనివల్ల గర్భం ధరిస్తానేమోనన్న భయం ఆడవారిలో ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా కలయికను ఆస్వాదించలేకపోతారు. అయితే ప్రస్తుతం అవాంఛిత గర్భం ధరించకుండా ఉండేందుకు బోలెడన్ని ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. గర్భ నిరోధక మాత్రలు, సాధనాలు.. వంటివి అందులో కొన్ని నిపుణుల సలహా మేరకు వీటిని ఉపయోగిస్తే సరిపోతుంది..
పెళ్లైన కొత్తలో చాలామంది ఆడవాళ్లు శృంగారం చేసే క్రమంలో వచ్చే నొప్పికి భయపడి కలయికలో పాల్గొనడానికి భయపడుతున్నారని తమ వద్దకొచ్చే ఫిర్యాదుల్ని బట్టి చెబుతున్నారు నిపుణులు. దీనివల్ల కూడా భార్యాభర్తలు లైంగిక జీవితం గురించి ఒకరి మనసులో దాగున్న ఆలోచనలు, కోరికలు నిర్మొహమాటంగా పంచుకోలేకపోతున్నారట..దానిని వదిలేస్తేనే శృంగారాన్ని ఎంజాయ్ చేయొచ్చు..
శృంగార జీవితానికి, వ్యక్తిగత పరిశుభ్రతకు దగ్గరి సంబంధం ఉంది. లైంగిక జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించడానికి ఇది తోడ్పడుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే కొంతమంది దంపతులు వ్యక్తిగత పరిశుభ్రతకు అంతగా ప్రాధాన్యం ఇవ్వరు. ఆలుమగల మధ్య దూరం పెరుగుతుంది. ఇలా జరగకూడదంటే వ్యక్తిగత పరిశుభ్రతను పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి..ఇవన్నీ తప్పక గుర్తుంచుకోవాలి..అప్పుడే ఇద్దరు ఎంజాయ్ చేస్తారు..