ప్రభాస్ కెరియర్ ను ఇబ్బందుల్లో పెట్టిన ఐరన్ లెగ్ హీరోయిన్..!

-

రెబల్ స్టార్ ప్రభాస్ కెరియర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన సినిమాలు ఫాలో అవుతున్న వారికి క్లియర్ గా తెలిసిందే. ఇదిలా ఉండగా ప్రభాస్ తన కెరియర్ లో నటించిన ఒక హీరోయిన్ అంటే చాలా కోపం అట. ఆమె తన కెరియర్ లోనే ఐరన్ లెగ్గుగా ఫీల్ అవుతారట. ఇంతకు ఎవరా హీరోయిన్ అని ఆలోచిస్తున్నారా.. ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం

యంగ్ రెబెల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఎన్నో బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాడు. ఎంతోమంది హీరోయిన్స్ తో కలిసి నటించిన ఈయన అందులో కొంతమంది వల్ల భారీ విజయాలను అందుకోగా మరి కొంతమంది హీరోయిన్లు నటించిన సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. అయితే ఆ హీరోయిన్స్ వల్లే ఇలా జరిగింది అనడానికి లేదు.. కానీ సెంటిమెంటల్ గా మాత్రం హీరోయిన్లు ప్రభాస్ కి కలిసి రావడం లేదనే మాట మాత్రం బాగా వినిపిస్తోంది. ఇకపోతే ప్రభాస్ ఒక హీరోయిన్ వల్ల ఇప్పటికే అసహనం వ్యక్తం చేస్తున్నాడు. అంతేకాదు ఆమె వల్ల తనకు రెండు డిజాస్టర్స్ వచ్చాయని ప్రభాస్ ఇప్పటికీ ఫీల్ అవుతున్నాడు అంటూ ఒక మాట సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇక ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గానే మిగిలిపోయాయి. దీంతో ఇక జన్మలో ఈ హీరోయిన్ తో నటించకూడదని ఫిక్స్ అయ్యారట ప్రభాస్. అంతేకాదు కొంతమంది దర్శకులు తన సినిమాలో ఆమె పేరుని సజెస్ట్ చేసినా నో అని చెప్పేసి రిజెక్ట్ చేశాడట. ఇక ఆమె ఎవరో కాదు ఛార్మీ కౌర్. చార్మితో ప్రభాస్ రెండు సినిమాలలో నటించారు.పౌర్ణమి, చక్రం సినిమాలు . అందులో పౌర్ణమి సినిమా ఫ్లాప్ అవ్వగా.. చక్రం సినిమా డిజాస్టర్ గా మిగిలింది. అందుకే ఛార్మీ ని తను ఐరన్ లెగ్ గా ఫీల్ అవుతారట ప్రభాస్.

Read more RELATED
Recommended to you

Latest news