పాములతో పాటు 72గంటలు గదిలో ఉన్న భారతీయుడి రికార్డు గురించి మీకు తెలుసా..?

-

మీరుండే గదిలో పాము వస్తే ఏం చేస్తారు. వెంటనే అక్కడి నుండి పారిపోతారు. కానీ అతడలా కాదు. పక్కనే పదుల సంఖ్యలో పాములున్నా పట్టించుకోకుండా 72గంటల పాటు అలాగే ఉన్నాడు. అతడి పేరు నీలం కుమార్ ఖైరీ. హెర్పటాలజిస్ట్. పాములు ఏమీ చేయవనీ, వాటిని రెచ్చగొడితేనే అవి కాటువేస్తాయని, లేదంటే ఎలాంటి హాని కలిగించవని నిరూపించడానికి ఒక గ్లాసు గదిలో పాములతో పాటు 72 గంటలు ఉన్నాడు. 72గంటల తర్వాత చిన్న గాటు కూడా లేకుండా సురక్షితంగా బయటకి వచ్చాడు.

1980లో జరిగిన ఈ సంఘటన అప్పట్లో సంచలనం రేపింది. పాములంటే ఎంతగానో ఇష్టం ఉన్న నీలం కుమార్, అవి ఎక్కడ కనిపించినా మనుషులకి దూరంగా వేసి వచ్చేవాడు. తన పక్కింటి వారు వాటిని చంపుతుంటే అలా చంపద్దని చెప్పి, దూరంగా పొదల్లోకి వేసి వచ్చేవాడు. ఐతే పాములు ఏం చేయవని, వాటిని రెచ్చగొడితేనే అవి కాటువేయాలని చూస్తాయని అందరికీ చెప్పాలని అనుకున్నాడు. అప్పుడే పాములతో పాటు 50గంటలు గడిపిన వ్యక్తి గురించి తెలుసుకున్నాడు.

వెంటనే తాను కూడా లా చేయాలనుకున్నాడు. అత్యంత విషపూరితమైన పాముల మధ్య 72గంటలు గడిపి పాములు ఏం చేయవని చెప్పాలని అనుకున్నాడు. అనుకున్నట్టే చేసి చూపించాడు. 28ఏళ్ళ వయసులో నీలం కుమార్ ఈ ఘనత సాధించాడు. ఈ రికార్డు నెలకొల్పిన తర్వాత పాముల పార్కు తయారు చేయాలని కలలు కని అది సాధించాడు. ఆ పార్కు ప్రస్తుతం రాజీవ్ గాంధీ జువాలజికల్ పార్క్ గా పిలవబడుతుంది. 1986లో ఈ పార్క్ ని పుణెలో నిర్మించాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు సరీసృపాల మీద అధ్యయనం చేస్తూనే ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news