వైరల్: శునకంలా మారిన మనిషి.. రూ.11 లక్షలు ఖర్చు పెట్టి!!

-

కుక్కలంటే చాలా మందికి ఇష్టం. కుక్కలు ఎంతో విశ్వాసంగా ఉంటాయని, చాలా మంది ఇంట్లో కుక్కలను పెంచుకుంటారు. చాలా మందికి విచిత్రమైన కోరికలు కలుగుతుంటాయి. వాటిని సాధించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఓ వ్యక్తి కుక్కలా బతకడం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసి.. చివరికి అనుకున్నది సాధించాడు. కుక్కలా మారిపోవాలని అనుకున్న తన నిర్ణయాన్ని పూర్తి చేసుకున్నాడు. జపాన్‌కు చెందిన టోకో అనే వ్యక్తికి విచిత్ర కోరిక. తనకు ఎప్పటి నుంచో శునకంలా బతకాలని కల. దీంతో ఆయన పూర్తిగా శునకంలా మారాలనుకున్నాడు. దీంతో ఆయన స్పెషల్ ఎఫెక్ట్స్ వర్క్ షాప్ జెప్పెట్‌ని సంప్రదించాడు. అల్ట్రా రియలిస్టిక్ డాగ్ కాస్ట్యూమ్‌ను తయారు చేయమని చెప్పారు.

శునకం-మనిషి
శునకం-మనిషి

దాదాపు రూ.11 లక్షలు ఖర్చు చేసి.. 40 రోజుల్లో కుక్క కాస్ట్యూమ్‌ను తయారు చేసుకున్నాడు. తన కొత్త బట్టలు వేసుకున్న టోకో ఆనందానికి అంతే లేదు. ఆ దుస్తులు వేసుకుని తన యూట్యూబ్ ఛానల్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. అలాగే ఫోటోలను ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. దీంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై చాలా మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం టోకో కుక్కలా బతుకుతున్నాడా..? లేదా కాస్ట్యూమ్ తీసేసి మనిషిలా మారాడా..? అని కామెంట్లు పెడుతున్నారు.

https://twitter.com/zeppetJP/status/1513336198856851461?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1513336198856851461%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Ftrending%2Fviral-news-man-fulfills-dream-of-living-as-a-dog-with-ultra-realistic-rough-collie-costume-au58-714313.html

Read more RELATED
Recommended to you

Latest news