ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వ భూషణ్ హరి చందన్ తో టిడిపి నేతల భేటీ ముగిసింది. గవర్నర్ తీరుపై టిడిపి నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. భేటీ అనంతరం టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని గవర్నరుకు వివరించామన్నారు. దళితులపై దాడులు చేయడం తమ పెటెంట్ అని వైసీపీ భావిస్తోందని మండిపడ్డారు. దళితులకు ఏపీలో స్వేచ్ఛగా జీవించే హక్కు లేదన్నారు నక్క ఆనంద్ బాబు.
గవర్నరును చాలా సందర్భాల్లో కలిశామని.. కానీ మేం ప్రస్తావించిన అంశాలపై గవర్నర్ స్పందించడం లేదన్నారు. జగన్ వచ్చినప్పుడల్లా గవర్నరుకు ఏం చెబుతున్నారో..? ఏమో..? కానీ.. ప్రజా సమస్యల పరిష్కారంపై గవర్నర్ ఫోకస్ పెడుతున్నట్టు కన్పించడం లేదన్నారు. పక్క రాష్ట్రాల్లో గవర్నర్లు ఏ విధంగా వ్యవహరిస్తున్నారోనని ఈ రాష్ట్ర గవర్నరు గమనించాలన్నారు.