ఇవాళ స్వగ్రామానికి వీర జవాన్ మురళి నాయక్ పార్దివదేహం

-

ఇవాళ స్వగ్రామానికి వీర జవాన్ మురళి నాయక్ పార్దివదేహం రానుంది. ఇవాళ రాత్రి 7 గంటలకు గుమ్మయగారిపల్లి గ్రామం నుంచి భారీ ర్యాలీ ఉంటుంది. ఇవాళ 10 గంటలకు వీర జవాన్ మురళి నాయక్ పార్దివదేహం రానుంది. ఇక రేపు మధ్యాహ్నం అంత్యక్రియలు పూర్తి అయ్యే అవకాశం ఉంది. పాక్ కాల్పుల్లో వీర మరణం పొందిన మురళి నాయక్ ను చివరి చూపు కోసం ప్రజలు భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది.

The mortal remains of brave soldier Murali Naik will reach his hometown today
The mortal remains of brave soldier Murali Naik will reach his hometown today

అటు వీర జవాన్ మురళీ నాయక్‌ మరణవార్త విని గుండెలవిసేలా రోదిస్తున్నారు కుటుంబ సభ్యులు. వీర జవాన్ మురళీ నాయక్ ఇంటి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. పాక్ కాల్పుల్లో మృతి చెందిన వీర జవాన్‌ మురళీ నాయక్‌… స్వస్థలం సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండా. ఇక ఎక్స్ వేదికగా మురళీ నాయక్ కు సీఎం చంద్రబాబు నివాళి అర్పించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news