ఆరోగ్య సూచీ ర్యాంకులు విడుదల చేసిన నీతి ఆయోగ్‌.. మూడో స్థానంలో తెలంగాణ

-

దేశంలోని రాష్ట్రాల ఆరోగ్య సూచీ నాల్గవ ఎడిషన్‌ ను విడుదల చేసింది నీతి ఆయోగ్. ఈ నివేదిక లో తెలంగాణ రాష్ట్రం మెరుగైన ఫలితాలను కనబరిచింది. “ఆరోగ్యకరమైన రాష్ట్రాలు, ప్రగతిశీల భారతదేశం” అనే శీర్షికతో రూపొందించబడిన నివేదికను ఇవాళ నీతి ఆయోగ్‌ విడుదల చేసింది. రాష్ట్రాలు ఆరోగ్య ఫలితాలలో ప్రతియేటా పనితీరు ర్యాంక్ లు పెరుగుతున్నాయి.

2018–19 నుండి 2019–20 మధ్య కాలంలో రాష్ట్రాల్లో ఆరోగ్య స్థితిగతుల పై అధ్యయనము చేసింది నీతి ఆయోగ్‌. ర్యాంకింగ్‌ను ‘పెద్ద రాష్ట్రాలు’, ‘చిన్న రాష్ట్రాలు’ మరియు ‘కేంద్రపాలిత ప్రాంతాలు’గా వర్గీకరించారు నీతి ఆయోగ్‌ సభ్యులు. ‘పెద్ద రాష్ట్రాల’లో, వార్షిక పెంపుదల పనితీరు పరంగా, ఉత్తరప్రదేశ్, అస్సాం మరియు తెలంగాణ మొదటి మూడు ర్యాంకింగ్ ను సాధించాయి రాష్ట్రాలు. UTలలో, ఢిల్లీ, జమ్మూ మరియు కాశ్మీర్ తర్వాత, అత్యుత్తమ ఇంక్రి మెంటల్ పనితీరును కనబరిచాయి రాష్ట్రాలు. అయితే.. ఈ ర్యాంకుల్లో.. ఏపీ ప్రభుత్వం ఎలాంటి పనితీరును కనబరచకపోవడం గమనార్హం.

 

Read more RELATED
Recommended to you

Latest news