అదరగొడుతున్న ఒక్కడు రీ రిలీజ్ పోస్టర్..

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం ఒక్కడు ఈ సినిమా విడుదలై 2023 జనవరి కి 20 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా మరొకసారి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు అయితే తాజాగా దీనికి సంబంధించిన పోస్టర్ వైరల్ గా మారింది..

అన్ని భాషల్లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది ఒకప్పుడు మంచి హిట్ టాక్ సంపాదించుకున్న చిత్రాలను మళ్లీ విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు ఇందులో మహేష్ బాబు ఒక్కడు చిత్రం కూడా ఒకటి ఈ సినిమా జనవరి 7న ప్రేక్షకులు ముందుకి రాబోతుంది.. అలాగే నాలుగు నెలల ముందుగానే ‘ఒక్కడు’ రీరిలీజ్ ప్రకటన రావడంతో మహేష్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. మహేష్ కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలిచిన ఒక్కడు స్పెషల్ షో చూసేందుకు వారు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఈ నేపధ్యంలో ఈ చిత్రం ట్రైలర్ ని సైతం కట్ చేసి రిలీజ్ చేసారు. ఆ ట్రైలర్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ ట్రైలర్ చూసిన ఆయన అభిమానులంతా సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.. గుణ శఖర్ దర్శకత్వంలో వచ్చిన ఒక్కడు జనవరి 15, 2003న విడుదలైన సంచలన విజయాన్ని అందుకొని సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇందులో మహేష్ బాబు సరసన భూమిక చావ్లా హీరోయిన్ గా నటించింది..

Read more RELATED
Recommended to you

Latest news