తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీరు దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుకున్నట్టు ఉంది – లక్ష్మణ్

-

అసెంబ్లీ సమావేశాల్లో లాగా కాకుండా పార్లమెంట్ లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం జవాబుదారీగా వ్యవహరించిందన్నారు బిజెపి పార్లమెంటరీ బోర్డు మెంబర్ లక్ష్మణ్. కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలు గా చెప్పుకుంటుందని ఆరోపించారు.

రాజ్యసభలో తెలంగాణ, తెలుగు రాష్ట్రాల సమస్యలు ప్రస్తావించానని… ఇక్కడ ప్రజల గొంతుగా ఉన్నానన్నారు. ఎస్టీ రిజర్వేషన్ లు.. రాష్ట్ర ప్రభుత్వం చేసిన మోసాన్ని… జాతీయ గ్రామీణ ఉపాధి నిధులను కాంట్రాక్టర్ లకు అప్పగించి , దుర్వినియోగం చేసిన అంశాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించానని తెలిపారు లక్ష్మణ్. ఇళ్ళ నిర్మాణాలకు కేంద్రం 3 వేల కోట్లకు పైగా కేటాయించిందన్నారు.

ఎంఎంటీఎస్ కి కేంద్రం తన వాట కన్నా ఎక్కువ కేటాయించిందన్నారు. చాలా ప్రాజెక్ట్ లకు కేంద్రం తన వాటా ఇచ్చినా..రాష్ట్రం మాచింగ్ గ్రాంట్ ఇవ్వక పోవడంతో పనులు జరగడం లేదన్నారు. దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుకున్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీరు ఉందని మండిపడ్డారు లక్ష్మణ్. FRBM కింద తెస్తున్న అప్పుల వడ్డీలు కట్టెందుకే సరిపోవడం లేదన్నారు. లెక్కకు మించి అప్పులు ఈ ప్రభుత్వం చేసిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news