అట్టహాసంగా కామన్వెల్త్​ గేమ్స్​ ఆరంభ వేడుక..

-

ఒలింపిక్స్ తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా పోటీల్లో ఒకటైన కామన్వెల్త్ క్రీడల సంబరం మొదలైంది. 22వ కామన్వెల్త్ గేమ్స్ ఆరంభోత్సవ వేడుకలు గురువారం అట్టహాసంగా సాగాయి. వేల మంది క్రీడాభిమానులు, ప్రేక్షకుల మధ్య 72 దేశాల క్రీడాకారులు జాతీయ పతాకాల్ని ధరించి మార్చ్​ఫాస్ట్​లో పాల్గొన్నారు.

భారత జట్టు ఫ్లాగ్ బేరర్లుగా డబుల్ ఒలింపిక్ విజేత, బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధుతో పాటు హాకీ టీమ్​కెప్టెన్​ మన్​ప్రీత్​ వ్యవహరించారు. ఇక ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో బ్రిటన్ ఫేమస్ బ్యాండ్ డ్యూరన్ డ్యూరన్ లైవ్ షో హైలైట్ గా నిలిచింది.

 

కాగా, ఈ మెగాక్రీడలు ఈ జులై 28 నుంచి ఆగస్టు 8 వరకు జరుగనున్నాయి. దాదాపు 72 దేశాలకు చెందిన ఐదు వేల మంది అథ్లెట్లు పతాకాల కోసం పోటీపడబోతున్నారు. ఈ క్రీడల్లో తొలిసారి మహిళల క్రికెట్​ను చేర్చడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news