2024 లోక్సభ ఎన్నికలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తమ పార్టీ ఔరంగాబాద్ తోపాటు మహారాష్ట్రలోని ఇతర స్థానాల నుంచి పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. అయితే ఎన్నికలలో ఎవరితో పొత్తు కుదుర్చుకోవాలన్న దానిపై కూడా కొన్ని పార్టీలతో సంప్రదింపులలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఎవరితో పొత్తు పెట్టుకుంటాం అనే దానిపై ఇంత త్వరగా వెల్లడించలేము అని తెలిపారు.
ఈ సందర్భంగా తెలంగాణలో బిజెపి పార్టీ పై విమర్శలు ఒప్పించారు. తెలంగాణలో 2014, 2018 ఎన్నికలలో బిజెపి ఓడిపోయిందని, 2023 ఎన్నికలలోనూ ఆ పార్టీకి ఓటమి తప్పదని జోష్యం చెప్పారు. ఇక ముస్లింలపై కొందరు ద్వేష భావాన్ని వ్యాప్తి చేస్తున్నారని, కానీ అలాంటి వారిపై ఎటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవడం లేదన్నారు. ముఖ్యంగా రాజస్థాన్ ప్రభుత్వ పేదలు భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్నారు కానీ.. జునైద్, నాసిర్లను చంపిన చోటుకు ఆ ప్రభుత్వం వెళ్లలేకపోయినట్లు అసద్ ఆరోపించారు.