ఉమ్రాన్‌కు ఆఖరి ఓవర్ ఇవ్వడానికి రీజన్ అదే: హార్దిక్ పాండ్య

-

ఐర్లాండ్‌లో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో హార్దిక్ పాండ్య నేతృత్వంలో భారత్ సిరీస్ కైవసం చేసుకుంది. కేవలం నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 225-7 భారీ స్కోరు సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ గట్టి పోటీని ఇచ్చింది. మ్యాచ్ ప్రారంభంలో భారీగా పరుగులు ఇచ్చిన టీమ్ ఇండియా.. ఆ తర్వాత బౌలర్లు కీలక ప్రదర్శన చూపారు. దీంతో ఐర్లాండ్ 221-5 స్కోరుకు పరిమితమైంది. దీంతో భారత్ 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది.

హార్దిక్ పాండ్య
హార్దిక్ పాండ్య

అయితే ఆఖరి ఓవర్‌లో యువ బౌలర్ ఉమ్రాన్ మాలిక్‌కు బౌలింగ్ ఇవ్వడంపై అభిమానులు ఆశ్చర్యపోయారు. అప్పటికే మూడు ఓవర్లలో 31 పరుగులు ఇచ్చి కేవలం 1 వికెట్ మాత్రమే తీశాడు. లాస్ట్ ఓవర్‌లో 17 పరుగులు చేయాల్సి ఉంటుంది. అయితే కీలకమైన చివరి ఓవర్‌లో తొలి మూడు బంతుల్లో రెండు ఫోర్లు, నో బాల్ ఇచ్చాడు. ఆఖరి మూడు బంతులకు కేవలం మూడు పరుగులు ఇవ్వడంతో భారత్ విజయం సాధించింది. అయితే చివరి ఓవర్‌ ఉమ్రాన్ మాలిక్‌కు ఇవ్వడంపై టీమ్ ఇండియా సారథి హార్దిక్ పాండ్యా వివరణ ఇచ్చాడు. ఉమ్రాన్ మాలిక్‌ పేస్ చాలా బాగుంటుంది. అటువంటి పేస్‌ను ఎదుర్కొని 18 పరుగులు చేయడం చాలా కష్టమని, అందుకే ఉమ్రాన్‌ మాలిక్‌కు బౌలింగ్ ఇచ్చానని హార్దిక్ పాండ్య తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news