Big News : ఉద్ధవ్‌ థాక్రేకు షాక్‌.. మెజారిటీ నిరూపించుకోవాలన్న గవర్నర్‌..

-

మహారాష్ట్రలో రాజకీయం సంక్షోభం నెలకొన్ని విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాని ఏక్‌నాథ్‌షిండే వర్గా వ్యూహాలు పన్నుతుంటే.. ప్రభుత్వం కూలిపోకుండా ఉండేందుకు ఉద్ధవ్‌ థాక్రే ప్లాన్‌ చేస్తున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న బీజేపీ కూడా మహారాష్ట్రలో కాషాయం జెండా ఎగువేసేందుకు పావులు కదుపుతుంది. ఈ క్రమంలోనే.. విధాన సభలో మెజారిటీ నిరూపించుకోవాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేను గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఆదేశించారు. మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ మంగళవారం రాత్రి గవర్నర్ ను కలసి, ప్రభుత్వాన్ని మెజారిటీ నిరూపించుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దీంతో గవర్నర్ ఈ దిశగానే నిర్ణయాన్ని ప్రకటించారు.

Amid Narayan Rane Row, Uddhav Thackeray's Remark on Yogi Adityanath  Surfaces; BJP Leader Seeks FIR

సభలో మెజారిటీ నిరూపణకు పెద్దగా సమయం కూడా ఇవ్వలేదు. ఈ నెల 30 నాటికి అసెంబ్లీలో మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)కి ఉందని నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశించారు. ఇందుకోసం ఈ నెల 30న సభ ప్రత్యేక సమావేశానికి ఆదేశాలు జారీ చేశారు. సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమం పూర్తి కావాలని, ఈ మొత్తాన్ని వీడియో తీయాలని గవర్నర్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news