వైరల్ అవుతున్న ఫోటో.. పిడకల టేస్ట్ గురించి అమెజాన్ లో రివ్యూ..

Join Our Community
follow manalokam on social media

ఆన్ లైన్ షాపింగ్ లు వచ్చాక బయటకి వెళ్ళడం బాగా తగ్గిపోయింది. చిన్న వస్తువు దగ్గర నుండి లక్షలు విలువ చేసే వస్తువుల దాకా ఆన్ లైన్లోనే దొరుకుతున్నాయి. పట్టణాల నుండి పల్లెల వరకు ఆన్ లైన్ సేవలు కొనసాగుతున్నాయి. లాక్డౌన్ కారణంగా పల్లెల్లో ఆన్ లైన్ షాపింగ్ చేసేవారు పెరుగుతున్నారు. అందుకే అందరికీ కావాల్సిన వస్తువులన్నీ ఆన్ లైన్లో పెడుతున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే, తరువాతి తరానికి షాపింగ్ అంటే ఇంట్లో కూర్చునే చేసే ఒక ప్రక్తియ లాగా మిగిలిపోయినా పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది. అంతలా ఆన్ లైన్ మార్కెట్ పెరిగిందంటే అతిశయోక్తి కాదు.

గుండుసూది మొదలుకుని అన్నీ ఆన్ లైన్లో లభ్యం అవుతున్నాయి. షాపింగ్ అనుభవం తగ్గిపోతున్నా టైం వేస్ట్ కావట్లేదన్న ఆలోచన అందరికీ వచ్చేసింది. ఐతే ప్రస్తుతం అమెజాన్ లో పిడకలు కొన్న ఒక కస్టర్మర్ దాని రివ్యూ రాసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.రివ్యూలో ఆశ్చర్యపడడానికి ఏముందనుకుంటున్నారా? సాధారణంగా పిడకలని పూజలు చేయడానికి, హోమాం కాల్చడానికి ఉపయోగిస్తారు. ఐతే ఆ యూజర్ రాసిన రివ్యూలో ఈ విధంగా ఉంది. నేను అమెజాన్ లో ఈ ప్రోడక్టు కొన్నాను. దాని రుచి చూసాను. అస్సలు బాగాలేదు. ఇవి తిన్న తర్వాత లూస్ మోషన్స్ అయ్యాయి. వీటిని తయారు చేసేటపుడు కనీస శుభ్రత పాటించాలి. టెస్ట్ మీదే కాకుండా కరకరలాడేలా ఉండేలా ఉంటే బాగుందని రివ్యూ రాసాడు.

ప్రస్తుతం ఇది ఇంటర్నెట్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ఇది నిజంగా నిజమా కాదా అన్నది తెలియనప్పటికీ, ట్విట్టర్ లో తెగ తిరుగుతుంది. అటు అమెజాన్ ఇండియా కూడా దీనిపై ఎలాంటి స్పందన తెలియజేయడం లేదు. మొత్తానికి పిడకలు టేస్ట్ బాలేదన్న యూజర్ ఎవరో కానీ, పేరు తెలియకుండానే ఫేమస్ అయిపోయాడు.

TOP STORIES

ఖాతాదారులకు అలర్ట్‌ చేసిన ఎస్‌బీఐ

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తన వినియోగదారులకు ఆన్‌లైన్‌ యూపీఐ మోసాలు పట్ల అలర్ట్‌ చేసింది. ట్వీట్టర్‌...