హైకోర్టు తీర్పు పై సుప్రీం కోర్టు కు వెళతామని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. మాకు ప్రజల ప్రాణాలే ముఖ్యమన్న ఆయన సుప్రీంకోర్టు ను కన్వీన్స్ చేస్తామనే నమ్మకం ఉందని అన్నారు. ఎన్నికల కోడ్ అమలులో లేదని, నిమ్మగడ్డ అనుకున్నంత మాత్రాన కోడ్ అమలులో ఉండదని అన్నారు. న్యాయ నిపుణులు, అధికారులతో చర్చిస్తామన్న ఆయన న్యాయమూర్తులు మారినా న్యాయం, ధర్మం గెలవాలనే కోరుకుంటున్నామని అన్నారు.
ఇక మరో మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి మాట్లాడుతూ సుప్రీం కోర్టుకు వెళతామని అన్నారు. లంచ్ మోషన్ మూవ్ చేస్తున్నామన్న ఆయన నిమ్మగడ్డ రమేష్ చౌదరి, చంద్రబాబు కలిసి చేస్తున్న కుట్ర ఇదని అన్నారు. ఎస్ఈసీ అధికారులతో సమావేశం పెట్టుకోవచ్చు… మాకేం అభ్యంతరం లేదని ఆయన అన్నారు. తిరుపతి ఉప ఎన్నికను రిఫరెండం గా తీసుకుని ధైర్యం చంద్రబాబుకు ఉందా? అని అయన ప్రశ్నించారు.