మానసిక ఒత్తిడిని తగ్గించగల శక్తి పక్షులకు ఉందంటున్న అధ్యయనం..!

-

మ్యూజిక్‌ ఎలాంటి మూడ్‌ను అయినా మార్చేస్తుంది. ఆ శక్తి సంగీతానికి ఉంది. సాడ్‌గా ఉంటే సాడ్‌ సాంగ్స్, లవ్‌లో ఉంటే రొమాంటిక్‌ సాంగ్స్, ఎంజాయ్‌ చేయాలంటే..ఫోక్‌ సాంగ్స్‌..ఇలా మనకు ఏది నచ్చితే అది మన ఇష్టాలకు తగ్గట్టుగా జోనర్‌ ఎంచుకుని మ్యూజిక్‌ను ఎంజాయ్‌ చేస్తాం. మానసిక ఒత్తిడిని తగ్గించే శక్తి పక్షుల కిలకిల రావాలకు ఉందట..ఈ విషయాన్ని అధ్యయనం ద్వారా కనుగొన్నారు. అయినా సైంటిఫిక్‌ ప్రూవ్‌ అవ్వకముందు నుంచే..ఎంతోమంది ఈ అనుభూతిని అనుభవించారు. అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు..మంచు దుప్పటి తీస్తున్నట్లు ఉండే వాతావరణం..అందులోంచి వచ్చే పక్షుల కిలకిలరావాలు..పక్కనే వేడి వేడి చాయ్‌..అసలు అప్పుడు మూడ్‌ ఎంత బాగుంటుంది..ఇంక ఏ సౌండ్స్ రాకుండా ఉంటే అది కదా గుడ్‌ మార్నింగ్‌ అంటే..మన అదృష్టం బాగోకపోతే..ఈ సీన్‌లో చెత్తబండి సాంగ్‌ కూడా రావొచ్చు..!!

అభిజ్ఞా, భావోద్వేగ పనితీరుపై పట్టణ ట్రాఫిక్ శబ్ధం, సహజ పక్షుల పాటల ప్రభావం గురించి పరిశోధనను జర్మనీకి చెందిన పరిశోధకుల బృందం చేసింది. నేచర్ పోర్ట్‌ఫోలియో జర్నల్ సైంటిఫిక్ రిపోర్ట్స్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. సంబంధిత సౌండ్‌స్కేప్‌లలో వివిధ సాధారణ ట్రాఫిక్ శబ్దాలు లేదా వివిధ పక్షి జాతుల కిలకిల రాగాలను వినడం ద్వారా శరీరంలో కలిగే ప్రభావాన్ని పరిశోధించడం ఈ ప్రయోగం మరొక లక్ష్యం.

పరిశోధన ఎలా జరిగిందంటే..

దీనిలో 295 మంది పాల్గొనేవారు, 6 నిమిషాల పాటు నాలుగు చికిత్సలను కేటాయించారు. ట్రాఫిక్ శబ్ధం తక్కువ, ట్రాఫిక్ శబ్ధం ఎక్కువ, బర్డ్‌సాంగ్ తక్కువ, బర్డ్‌సాంగ్ హై వెరైటీ సౌండ్‌స్కేప్‌లతో ప్రయోగాన్ని నిర్వహించారు. ఈ ప్రయోగంలో పాల్గొనేవారు ఎక్స్‌పోజర్‌కు ముందు.. తర్వాత డిజిట్-స్పాన్.. డ్యూయల్ ఎన్-బ్యాక్ టాస్క్‌ను పూర్తి చేసారు, అలాగే విచారం, ఆందోళన వంటి అనేక ప్రశ్నపత్రాలను కూడా పూర్తి చేసారు.

ప్రపంచం త్వరగా పట్టణీకరణ చెందుతున్నందున, మానవులు నివసించే పర్యావరణం కూడా నిరంతరం మారుతూ ఉంటుంది. 2050 నాటికి, ప్రపంచ జనాభాలో 70% మంది నగరాల్లో నివసిస్తారని అంచనా. యూరప్ వంటి కొన్ని ప్రాంతాలు ఇప్పటికే ఈ సంఖ్య దాటింది. పట్టణ పర్యావరణం మన శ్రేయస్సును ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడం అనేది పట్టణీకరణ, మానసిక ఆరోగ్య ఫలితాలకు సంబంధించినది.

Read more RELATED
Recommended to you

Latest news