హీరో చెంప చెల్లుమనిపించిన టెక్నీషియన్.. అసలు ఏమైందంటే..?

-

సాధారణంగా వెండి తెర సినిమా షూటింగ్లో అయినా.. బుల్లితెర సీరియల్ షూటింగ్లో అయినా సరే వ్యక్తుల మధ్య తారతమ్యాలు రావడం, అప్పుడప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. కానీ అవి తారాస్థాయికి చేరుకున్నప్పుడు ఒకరినీ ఒకరు దూషించుకోవడం.. దెబ్బలాడుకోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇక ఈ క్రమంలోనే బుల్లితెర హీరో చెంప చెల్లుమనిపించారు ఒక టెక్నీషియన్ .ఇక అసలు విషయం ఏమిటో ఇప్పుడు చదివి తెలుసుకుందాం.

తాజాగా శ్రీమతి శ్రీనివాస్ అనే సీరియల్ రోజురోజుకు ప్రేక్షకుల ఆదరణ పొందుతూ మంచి సక్సెస్ రేట్ వైపు దూసుకుపోతోంది. ఈ సీరియల్ షూటింగ్ సెట్లో నిన్న సంచలన ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఆ సీరియల్ హీరో చందన్ నిన్న జరిగిన షూటింగ్లో సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించాడట. అంతేకాదు అదే సీరియల్ కి పని చేస్తున్న ఓ టెక్నీషియన్ ను అనుచితంగా తిడుతూ నోరు పారేసుకోవడంతో అక్కడున్న యూనిట్ అంతా చందన్ పై తిరగబడ్డారు. ఈ క్రమంలోనే టెక్నీషియన్ తల్లిని దూషించడంతో తట్టుకోలేక బుల్లితెర హీరో చందన్ చెంప పగలగొట్టాడు ఆ టెక్నీషియన్. అంతేకాదు అతనిపై మాటలు దాడికి దిగారు ఇంక చేసేదేమీ లేక అక్కడున్న మిగతా సిబ్బంది చందన్ తో టెక్నీషియన్ కు క్షమాపణలు కూడా చెప్పించడం జరిగింది.

అయితే ఆ టెక్నీషియన్ మాత్రం తప్పుడు మాటలు మాట్లాడాడు. నా తల్లిని దూషించాడు ఇప్పుడు సారీ చెప్తే ఊరుకుంటారా? అంటూ ఆయన అన్నారట. అయితే ఇప్పుడు ఆ ఘటన గురించి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా హాట్ టాపిక్ గా నడుస్తోంది. నిజానికి కన్నడ చిత్ర పరిశ్రమలో హీరో చందన్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్య హీరోయిన్ గా చందన్ హీరోగా జంటగా నటించిన చిత్రం ప్రేమ బరహ. ఇక ఆ తర్వాత రాధా కళ్యాణ, లక్ష్మీ బారమ్మ వంటి కన్నడ సీరియల్స్ తో కూడా ఇతడు మంచి ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. మరి ఈ ఘటనతో ఆయన కెరియర్ ఇరుకున పడ్డట్టే అని పలువురు చెబుతూ ఉండడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news