తెలంగాణ రాజకీయాల్లో ఒక తరంగంలా దూసొకొచ్చిన నేత బండి సంజయ్. మొదటి నుంచి ఆయనకు దూకుడుగా వ్యవహరించే నేతగా పేరుంది. దీన్ని ఆసరాగా చేసుకునే ఆయన యూత్‌లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. ఇక ఇటు రాజకీయాల్లో కూడా మంచి మాస్ లీడర్‌గా ఎదిగారు బండి సంజయ్. అయితే ఆయన ఎక్కువగా ఆవేశంగా మాట్లాడుతూ అప్పుడుప్పుడు నోరు జారడమే ఆయనకు పెద్ద మైనస్ గా తయారవుతోంది.
ఏదైనా విషయంపై మాట్లాడే టప్పుడు దాని గురించి పూర్తిగా అవగాహన ఉంటేనే మాట్లాడాలి. అలా కాదని ఏమీ తెలుసుకోకుండా మాట్లాడితే నవ్వుల పాలవ్వడం ఖాయమే. కానీ దీన్ని పట్టించుకోకుండా బండి సంజయ్ మరోసారి పార్లమెంట్ సాక్షిగా తడబడ్డారు. దీంతో ఇప్పుడు అందరూ కామెంట్లు చేస్తున్నారు.
ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో రీసెంట్ గా బండి సంజయ్ మాట్లాడుతూ తాను ఏది చేస్తున్నానో తెలియకుండా రెచ్చిపోయి కేంద్రాన్ని ప్రశ్నించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న 14, 15 ఫైనాన్స్ కమిషన్ స్కీమ్ కింద నిధుల మంజూరి విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటోందని అనడంతో అంతా షాక్ అయ్యారు. ఇక దీనికి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి కనీసం కనికరం చూపించకుండా బండికి పంచ్ వేశారు. రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారికంగా వచ్చేఏ నిధులపై కూడా కేంద్రం పెత్తనం చేయడానికి అవకాశం లేదని చెప్పడం గమనార్హం.