టీఆర్ ఎస్‌పై హైప్ క్రియేట్ చేస్తున్న బండి సంజ‌య్‌.. రేవంత్ ఎఫెక్టేనా..?

-

తెలంగాణ రాజ‌కీయాల్లో త‌మ‌కు కాంగ్రెస్‌తో ఎలాంటి పోటీ లేద‌ని మొన్న‌టి వ‌ర‌కు బండి సంజ‌య్(Bandi Sanjay) తెలిపారు. అంతే కాదు టీఆర్ ఎస్‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓట‌మి ఖాయ‌మ‌ని, తామే అధికారంలోకి వ‌స్తామంటూ ప్ర‌క‌టించుకుంటున్నారు. కానీ అనూహ్యంగా కాంగ్రెస్‌కు కొత్త బాస్‌గా రేవంత్ రావ‌డంతో రూటు మార్చారు. టీఆర్ ఎస్‌ను మొన్న‌టి వ‌ర‌కు లెక్క చేయ‌కుండా మాట్లాడిన బండి సంజ‌య్ ఇప్పుడు దాన్ని చాలా పెద్ద ప్ర‌త్య‌ర్థిగా చూపిస్తున్నారు.

బండి సంజ‌య్ /Bandi Sanjay
బండి సంజ‌య్ /Bandi Sanjay

ఇందుకు కార‌ణం ఎక్క‌డ రేవంత్ ఇమేజ్ పెరుగుతుందో అనే భ‌యం. ఇక రేవంత్ గురించి కూడా బీజేపీ నేత‌లు ఎవ‌రూ స్పందించ‌క‌పోవ‌డానికి కార‌ణం కూడా ఇదే. రేవంత్ గురించి ఎక్క‌డ విమ‌ర్శించినా.. ఆయ‌న ఇమేజ్ అమాంతం పెరిగే ఛాన్స్ ఉంద‌ని గ్ర‌హించే క‌మ‌ల‌నాథులు ఈ ప్లాన్ వేశారని తెలుస్తోంది.

ఇక టీఆర్ ఎస్ పార్టీని కావాల‌నే బీజేపీ స్టేట్ చీఫ్ అయిన బండి సంజ‌య్ హైలెట్ చేస్తున్నట్టు స‌మాచారం. అప్పుడే దాన్ని ఎదుర్కొనే శ‌క్తి త‌మ‌కే ఉంద‌ని చెప్పుకోవ‌చ్చు. దాంతో రేవంత్ ఇమేజ్ ప‌క్క‌కు పోతుంది. అంటే కావాల‌నే తాము రేవంత్ పై ఉన్న చ‌ర్చ‌ను ప్ర‌జ‌ల నుంచి దూరం చేసిన వాళ్లం అవుతామ‌ని బీజేపీ నేత‌లు భావిస్తున్నారు. అంటే రేవంత్ ఎఫెక్ట్ క‌మ‌లం పార్టీలో బాగానే ఎఫెక్ట్ చూపుతోంద‌ని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news