కరోనా ల్యాబ్ లోనే పుట్టింది.. ప్రూఫ్ ఉందంటున్న చైనా శాస్త్రవేత్త..

-

ప్రపంచాన్ని గజగజా వణికిస్తోన్న కరోనా వైరస్ కి కేంద్రస్థానం చైనాలోని వుహాన్ నగరం. వుహాన్ సిటీలోని జంతువుల మార్కెట్ లో ఉద్భవించిందని చెప్పబడుతున్న ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ప్రజలని తీవ్ర ఇబ్బందులకి గురి చేస్తుంది. ఐతే ఈ వైరస్ చైనాలోని ల్యాబ్ లోనే తయారైందని కామెంట్లు వచ్చి సంగతి తెలిసిందే. ఈ విషయమై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇలాంటి కామెంట్లను ఖండించింది.

ఐతే తాజాగా చైనా వైరాలజిస్టు లి-మెంగ్ యాన్ , కరోనా వైరస్ వుహాన్ సిటీలోని ప్రభుత్వ ఆధీనంలో నడుపుతున్న ల్యాబ్ లోనే పుట్టిందని సంచలన విషయాలు బయటపెట్టింది. దీనిపై తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని అంటోంది. వైరస్ లపై అధ్యయనంలో భాగంగా న్యూమోనియా చదువుతున్నప్పుడు ఈ వైరస్ గురించి తెలిసిందనీ చెప్పుకొచ్చింది. ఈ విషయాన్ని బయటకి వెల్లడిస్తే చైనా అధికార్లు తనని బెదిరించారనీ, తనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని అంటుంది.

అందుకే ప్రస్తుతం తాను అమెరికాలో ఉంటున్నానని తెలిపింది. కరోనా వైరస్ పై ప్రపంచమంతా పోరాడుతున్న తరుణంలో చైనాలో పరిస్థితులు మామూలు స్థితికి రావడం, వ్యాపారా కార్యకలాపాలు పునః ప్రారంభం అవడం, కేసులు పూర్తిగా తగ్గిపోవడం చూస్తూనే ఉన్నాం.

Read more RELATED
Recommended to you

Latest news