భర్తను బ్యాట్‌తో కొట్టిన భార్య.. ఎందుకో తెలిస్తే షాక్!

-

భార్యాభర్తల మధ్య గొడవలు కామన్. ఓ దంపతులకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ క్రమంలో బుధవారం రాత్రి కూడా గొడవ జరిగింది. దీంతో కోపోధ్రిక్తురాలైన భార్య.. భర్తను క్రికెట్ బ్యాట్‌తో చితకబాదింది. దీంతో భర్త ఒక్కసారిగా ఏడుస్తూ కేకలు పెట్టాడు. భర్త అరుపులు విన్న స్థానికులు ఆ ఇంటికి పరుగులు తీశారు. దీంతో ఒకరిపై మరొకరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో వారిద్దరిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని బికనీర్‌లో చోటు చేసుకుంది.

భార్యభర్త-గొడవ
భార్యభర్త-గొడవ

రిద్మల్సర్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు అనీష్, అమీన్ నివాసముంటున్నారు. వారిద్దరూ తరచూ గొడవ పడుతుంటారు. బుధవారం రాత్రి జరిగిన గొడవలో భార్య అనీషా భర్త అమీన్‌ను బ్యాట్‌తో కొట్టింది. పెద్దగా అరుపులు రావడంతో పొరిగింటి వారు గుమిగూడారు. స్థానికులు బ్యాట్‌ను లాక్కొని.. అమీన్‌ను ఆస్పత్రికి తరలించారు. అమీన్ తలకు 17 కుట్లు వేశారు. తాగి వచ్చి తనను కొడుతున్నాడని అనిషా కేసు పెట్టింది. ఈ మేరకు గాయపడిన భర్త కోలుకుతున్న అమిన్ స్టేట్‌మెంట్ రికార్డ్ చేస్తామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news