డైరెక్ట్ గా గవర్నర్ వద్దకు షర్మిల టీం

ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో గ‌వ‌ర్న‌ర్ కు వైఎస్ ష‌ర్మిల టీం లేఖ‌ రాసింది. క‌రోనా వైద్యాన్ని వెంట‌నే ఆరోగ్య‌శ్రీ లో చేర్చేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని గ‌వ‌ర్న‌ర్ కు విజ్ఞప్తి చేసారు. ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో బెడ్లు దొర‌క‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది అని ఇందిరా శోభ‌న్ ఆరోపించారు. ప్రైవేట్ ఆసుప‌త్రుల‌కు వెల్లి చికిత్స చేయుంచుకొనే స్థోమ‌త‌లో పేద‌వారు లేరు అని పేర్కొన్నారు.

ఆరోగ్య‌శ్రీలో చేర్చితే పేద‌వారికి ఉప‌యోగం అని అన్నారు. క‌రోనా తో చ‌నిపోతున్న జ‌ర్న‌లిస్ట్ ల‌కు సైతం 50ల‌క్ష‌ల ప్ర‌మాద‌భీమ వ‌ర్తింప జేయాలి అని కోరారు. జ‌ర్న‌లిస్ట్ ల‌కు ప్రంట్ లైన్ వారియ‌ర్స్ గా గుర్తించి అక్రిడేష‌న్ తో సంబందం లేకుండా మెరుగైన వైద్యం అందించాలి అని ఆమె కోరారు.