నెల్లూరు కోర్టులో ఫోర్జరీ పత్రాల చోరీ.. సిబిఐ విచారణ ప్రారంభం

-

నెల్లూరు కోర్టులో ఫోర్జరీ పత్రాలు చోరీకి సంబంధించి సిబిఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. సిబిఐ చెన్నై విభాగం మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో సిబిఐ అధికారులు రంగంలోకి దిగారు.

మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మొదటి నిందితుడిగా ఉన్న ఈ కేసులో ఒక ఎస్పీ స్థాయి అధికారి, ముగ్గురు సిబ్బందితో కూడిన బృందం నెల్లూరుకి చేరింది. చెన్నై నుంచి వచ్చిన సిబిఐ అధికారులు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లోని గెస్ట్ హౌస్ లో కొందరు పోలీస్ అధికారుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news