అక్కడ సగం రేటుకే బీరు..ఎగబడుతున్న మందుబాబులు..!!

-

ఈ మధ్య జనాలను ఆకర్షించేందుకు హోటల్స్, రెస్టారెంట్ లు, పబ్ లు కొత్త కొత్త ఆఫర్లను అందిస్తున్నాయి..వాటి కోసం జనాలు ఎగబడుతున్నారు..తాజాగా మరొక పబ్ వినూత్న ఆలోచన చేసింది.ప్రత్యేకమైన ఆఫర్ అందుబాటులో ఉంచింది. సన్ ఫ్లవర్ ఆయిల్ ఇస్తే.. బీర్ ఇస్తోంది. ఇదేం ఆఫర్ అని అనుకుంటున్నారా.. అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. మ్యూనిచ్‌లోని ఒక పబ్ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌కు బీర్ ఇస్తోంది. దీనికి ఒక కారణం ఉంది. యూరప్‌లో వంట నూనెల కొరత తీవ్రంగా ఉంది..దాంతో ఈ ఆఫర్ ను అందిస్తుంది.

ఇలా వచ్చిన నూనెను స్టోర్ చేస్తుంది..ఏమి ఐడియా కదా..
రష్యా- ఉక్రెయిన్ ల మధ్య జరిగిన యుద్ధం కారణంగా అమెరికా లాంటి ప్రముఖ దేశాలు కూడా ద్రవ్యోల్బణం దెబ్బకు వణికిపోతున్నాయి. ధరలు భారీగా పెరిగిపోయాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం ఏకంగా 40 ఏళ్ల గరిష్ట స్థాయిలోనే ఉంది. గత నెలలో ఇది 9.1 శాతంగా నమోదు అయ్యింది. దీంతో అక్కడి ప్రభుత్వం ఫెడ్ రేటును పెంచుకుంటూ పోతోంది..

ఆయిల్ ప్రపంచ ఎగుమతుల్లో ఉక్రెయిన్, రష్యా దేశాలే దాదాపు 80 శాతం వాటాను కలిగి ఉన్నాయి. జర్మనీ సహా చాలా వరకు యూరప్ దేశాలు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాయి. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల సన్‌ఫ్లవర్ ఆయిల్ సరఫరా తగ్గిపోయింది. దీంతో ఆయిల్ కొరత తీవ్రంగా ఉంది. సూపర్ మార్కెట్లలో కూడా స్టాక్ ఉండటం లేదు. వచ్చిన కస్టమర్లకు కూడా ఇంతే ఇవ్వాలి అనే రూల్ ను పెట్టారు..

ఆయిల్ కొరతను అధిగమించడానికి మ్యూనిచ్‌లోని గిసింజర్ బ్రూవరీ అనే పబ్ స్పెషల్ ఆఫర్‌తో కస్టమర్ల ముందుకు వచ్చింది. సన్‌ఫ్లవర్ ఆయిల్ ఎంత ఇస్తే.. అంత బీర్ ఇస్తామని ప్రకటించింది. అంటే ఒక లీటరు సన్‌ఫ్లవర్ అయిల్ ఇస్తే.. ఒక లీటరు బీర్ లభిస్తుంది. బీర్ లవర్లకు ఇది తీపికబురు అనే చెప్పుకోవాలి. కిచెన్‌లో నూనె అయిపోయిందని, బయట చూస్తే ఆయిల్ కొరత ఉందని, అందుకే ఇలాంటి ఆఫర్ తీసుకువచ్చామని పబ్ మేనేజర్ ఎరిక్ హాఫ్‌మన్ చెప్పినట్లు రాయిటర్స్‌ పేర్కొంటోంది. వారానికి 30 లీటర్ల ఆయిల్ అవసరం అయితే 15 లీటర్లు మాత్రమే లభిస్తోందని, కొన్ని సందర్భాల్లో ఇంకా తక్కువ ఆయిల్ వస్తోందని ఆయన వివరించారు. కాగా ఈ ఆఫర్ కింద ఇప్పటి దాకా 400 లీటర్ల ఎక్స్చేంజ్ జరిగిందని ఆయన వెల్లడించారు..ఆయిల్ ఇస్తే సగం ధరకే బీరు ను అందిస్తున్నారు..ఈ ఆఫర్ కోసం జనాలు పబ్ ముందు క్యూ కడుగుతున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news