అరటి తోటతో పాటు ఈ పంటలు వేస్తే నష్టం రాదు..!

-

చాలా మంది రైతులు పంటలు వేసినప్పటికీ కూడా నష్టాలు చూడాల్సి వస్తోంది. అలా కాకుండా మంచి దిగుబడి రావాలంటే ఇలా చేయాలి. ఏడాది పొడవునా రాష్ట్రంలో అయితే అరటి సాగుకు అనుకూలంగా ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేస్తూ ఉంటారు.

దాదాపుగా అరవై మూడు లక్షల టన్నుల ఉత్పత్తి సాధిస్తూ దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఎక్కువ మంది అరటి పంట వేయడానికి ఆసక్తి చూపుతారు. కానీ ఒకోక్కసారి వాతావరణ పరిస్థితుల వల్ల నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి.

అరటి పంటని ప్రధాన పంటగా సాగు చేస్తే దిగుబడి పొందడానికి దాదాపుగా తొమ్మిది నెలల సమయం పడుతుంది. అందుకని చాలా మంది రైతులు అంతర పంటల సాగు చేస్తారు. దీంతో నష్టాలు రాకుండా ఉంటాయి. వేసవి కాలంలో నీటి సదుపాయం ఉన్న పొలాల్లో అరటి తో పాటు అంతర పంటగా పంటలు వేసుకుంటే రైతులకు అదనపు ఆదాయం వస్తుంది.

అలాగే బొప్పాయి, నేల చిక్కుడు, టమాటా, వంగ ఇలాంటివి కూడా పండించుకోవచ్చు. కంద, క్యారెట్, బీట్రూట్, కాలీఫ్లవర్, క్యాబేజి లాంటి వాటిని కూడా అంతర పంటలుగా సాగు చేస్తే మెరుగైన దిగుబడి వస్తుంది. ఇలా మంచిగా దిగుబడి రైతులు పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news