అంబెడ్కర్ ఆశయాలు ముందుకు తీసుకుపోవాలని.. రాజ్యాంగం వల్లే అందరికి న్యాయం జరుగుతుందన్నారు మాజీ పిసిసి అధ్యక్షుడు వి హనుమంతరావు. కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదన్నారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నారని మండిపడ్డారు. ఈడీ, సీబీఐ లను ఉపయోగించి దాడులు చేస్తున్నారని ఆరోపించారు.
24 గంటల్లో ఈసీ కమిషనర్ ను ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. నీతి నిజాయితీ గల అధికారిని నియమించాలన్నారు వీ హనుమంతరావు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. బిసి ,ఎస్సి, ఎస్టీ,మైనార్టీ ల్లో ఇంకా చైతన్యం రావాలన్నారు. 2019 లో ఏప్రిల్ 12 న పంజాగుట్ట లో అంబెడ్కర్ విగ్రహం పెట్టామన్నా ఆయన దానిని ..13 న తొలగించారని మండిపడ్డారు. అంబేద్కర్ విగ్రహాన్ని తీయడానికి ఆర్డర్స్ ఇచ్చింది దాన కిషోర్ అని అన్నారు. అంబెడ్కర్ విగ్రహం పెట్టాలని ఎన్నోసార్లు లేఖ రాశామని.. అన్ని పార్టీలతో సమావేశాలు నిర్వహించామన్నారు.
దీని గురించి అసెంబ్లీలో భట్టి విక్రమార్క కూడా మాట్లాడారని తెలియజేశారు. ఈ విషయాన్ని పార్లమెంట్ లో కూడా మాట్లాడాలని కాంగ్రెస్ ఎంపీల కు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఇక కాంగ్రెస్ నేతల్లో మార్పు రావాలన్నారు విహెచ్. కమిటీలు వేయగానే అయిపోదు..బడుగు బలహీన వర్గాలకు అవకాశం ఇవ్వాలన్నారు. అందరినీ కలుపుకొని పోతేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు.