వినాయకచవితి పండుగను దేశ వ్యాప్తంగా అందరూ కుటుంబంతో చాలా సంతోషంగా జరుపుకుని ఉంటారు. కొన్ని చోట్ల ఇప్పటికే గణేషుని విగ్రహాలను నిమజ్జనం చేయగల, కొన్ని చోట్ల ఇంకా నిమజ్జనం జరగలేదు. ముఖ్యంగా తెలంగాణను రాష్ట్రంలోని హైద్రాబాద్ లో ప్రతి సంవత్సరం గనుషుని మహోత్సవం ఎంత గ్రాండ్ గా జరుపుతారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ ఏడాది కూడా అంతకు మించి జరిపించడానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. హైద్రాబాద్ లో గణేశుని నిమజ్జనం ఉత్సవం 28 మరియు 29వ తేదీలలో జరగనుంది. ఇందుకోసం ఎటువంటి ఇబ్బంది జరగకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలను తీసుకుంటోంది. ఇందులో భాగంగా మద్యం షాపులను ఈ రెండు రోజుల పాటు మూసివేయాలని నిర్ణయం తీసుకుంది కేసీఆర్ ప్రభుత్వం.
మద్యం షాపులు, కల్లు దుకాణాలు, బార్లు అన్నీ కూడా 28వ తేదీ ఉదయం 6 గంటల నుండి 29వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మూసి ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. దీనితో మందు బాబులు అంతా పూర్తి నిరాశలో ఉన్నారు.