ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రులు బొత్స సత్యనారాయణ,పినిపే విశ్వరూప్ దాడిశెట్టి రాజా,తానేటి వనిత,మేరుగ నాగార్జున.. స్వల్ప ఆధిక్యంతో గెలుస్తారని ఆరా మస్తాన్ సర్వే తెలిపింది.కాకాణి గోవర్థన్ రెడ్డి,బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి,కె. అంజాద్ బాషా స్వల్ప ఆధిక్యం,పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తాడని అంచనా వేసింది.
ఇదిలా ఉంటే… ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి 92-99 సీట్లు వస్తాయని Rise సర్వే అంచనా వేస్తోంది. కూటమిలోని మిగతా పార్టీలైన జనసేన: 11-16, బీజేపీ: 0-3 స్థానాల్లో గెలుస్తాయని ఎగ్జిట్ పోల్ రిపోర్టులో పేర్కొంది. మరోవైపు టీడీపీ: 110 (+/-5) సెగ్మెంట్లు సొంతం చేసుకుంటుందని Prism ఎగ్జిట్ పోల్ చెబుతోంది. జనసేన: 14 (+/-1), బీజేపీ: 2(+/-1) చోట్ల గెలిచే అవకాశం ఉందని ప్రకటించింది. వైసీపీ 60 (+/-5) నియోజకవర్గాలకే పరిమితం కాబోతుందని వివరాలు వెల్లడించింది.