రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయని ప్రజా ప్రతినిధులు వీళ్లే..

-

వివిధ కారణాలతో రాష్ట్రపతి ఎన్నికల్లో 8 మంది ఎమ్.పిలు ఓటు హక్కును ఉపయోగించుకోలేక పోయారు. 8 మంది ఎమ్.పిలలో ఇద్దరు బిజేపి ఎమ్.పిలు ఓటు హక్కును ఉపయోగించుకోలేక పోయారు. ఓటు వేయలేక పోయున కాంగ్రెస్, సమాజవాది పార్టీ, బి.ఎస్.పి, శివసేన, ఏఐఎమ్ఐఎమ్, డి.ఎమ్.కే పార్టీ ల నుంచి ఒక్కో ఎమ్.పి ఈ లిస్ట్‌ లో ఉన్నారు. ఇక విదేశాల్లో వైద్య చికిత్స కోసం బిజేపి ఎమ్. పి సన్నీ డియోల్ వెళ్లగా… ఆసుపత్రి లోని “ఇంటెన్సివ్ కేర్ యూనిట్” లో ఉన్నారు మరో బిజేపి ఎమ్.పి
సంజయ్ ధోత్రే.

ఆసుపత్రిలో శివసేన ఎమ్.పి గజానన్ కీర్తికర్ చికిత్స పొందుతుండగా…“బహుజన్ సమాజ్ పార్టీ” కి చెందిన ఎమ్.పి అతుల్ సింగ్‌ జైలులో ఉన్నారు.ఏఐఎమ్ఐఎమ్ ఎమ్.పి ఇంతియాజ్ జలీల్, కాంగ్రెస్ ఎమ్.పి మహమ్మద్ సాధిక్, సమాజవాది పార్టీ ఎమ్.పి షాఫికుర్ రెహమాన్ బర్ఖ్, డి.ఎమ్.కే కు చెందిన పారివేంధర్ ఓటింగ్ లో పాల్గొన లేకపోయారు. ఇది ఇలా ఉండగా..“వీల్ ఛైర్స్” ( చక్రాల కుర్చీల్లో) లో వచ్చి ఓటు వేసిన మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్, అలాగే, సమాజవాది పార్టీ” వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ చక్రాల కుర్చీ లో వచ్చి ఓటింగ్ లో పాల్గొన్నారు. ఆసుపత్రి నుంచి చక్రాల కుర్చీ లో ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని నేరుగా ఓటు వేసేందుకు వచ్చారు ప్రదీప్త కుమార్ నాయక్. కరోనా సోకినా… “పిపిఈ” కిట్లు ధరించికేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మాలా సీతారామన్, సహచర కేంద్ర మంత్రి ఆర్.కే.సింగ్ ఓటింగ్ లో పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version