పవన్ కళ్యాణ్ ను బాలయ్య అడగబోయే ప్రశ్నలు ఇవే..!

-

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 నిర్విరామంగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఎప్పుడు కెమెరా ముందుకు వచ్చి ఇంటర్వ్యూలు ఇవ్వని పెద్దపెద్ద స్టార్ లు కూడా హాజరవుతున్నారు. నందమూరి బాలకృష్ణ హోస్టుగా చేస్తున్న ఈ షో కి విపరీతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఆసక్తి రేకెత్తించే ప్రశ్నలు వినోదాన్ని అందించే అల్లరితో అన్ స్టాపబుల్ షో దూసుకుపోతోంది. బాలయ్య షో కి ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు ,నారా లోకేష్, విశ్వక్సేన్, శర్వానంద్ , అడవి శేష్, సిద్దు జొన్నలగడ్డ లాంటి హీరోలు హాజరయ్యారు. అంతేకాదు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, అలనాటి అందాల తార రాధిక తదితరులు కూడా వచ్చి సందడి చేశారు.

రాబోయే ఎపిసోడ్ గురించి అందరిలో అంతులేని ఆసక్తి నెలకొంది. ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్కి పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ తో పాటు గోపీచంద్ కూడా హాజరు కాబోతున్నారు. డిసెంబర్ 30వ తేదీన ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ షో కి హాజరవుతూ ఉండడం ఖారార్ అయిన విషయం తెలిసిందే.. పవన్ కళ్యాణ్ , బాలయ్య ఒకే వేదికపై కనిపించడం కలలో కూడా ఊహించని సంఘటన. అలాంటిది అది సాధ్యం కాబోతోంది.అయితే ఈ మధ్య బాలయ్య బాగా అల్లరి చేస్తున్నారు . పవన్ కళ్యాణ్ సైలెంట్ గా ఉంటున్నారు అలాంటి వీరు ఇద్దరు ఒకే వేదికపై కనిపిస్తే ఎలా ఉంటుంది అనే ఉత్కంఠ కూడా మొదలయ్యింది.

ఇకపోతే తాజాగా బాలయ్య పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నిస్తారు అన్న అనుమానాలు కూడా అభిమానులలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోని బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ను ఎలాంటి ప్రశ్నలు అడగబోతున్నారనేది లీక్ అయ్యింది. రాజకీయ వ్యవహారాలు, పవన్ కళ్యాణ్ కెరియర్ లో త్రివిక్రమ్ ప్రమేయం, ఆయన వ్యక్తిగత జీవితం గురించి కూడా కొన్ని ప్రశ్నలు అడిగే ఆస్కారం ఉందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news